Home ఎంటర్‌టెయిన్మెంట్ CBFC సంచ‌ల‌న నిర్ణ‌యం.. టాలీవుడ్, బాలీవుడ్ మేక‌ర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ! – VRM MEDIA

CBFC సంచ‌ల‌న నిర్ణ‌యం.. టాలీవుడ్, బాలీవుడ్ మేక‌ర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇకపై సినిమాల రిలీజ్ ప్లానింగ్ పూర్తిగా మారిపోనున్నాయి. ఎంతో కాలంగా మేకర్స్‌కు అత్యవసర సమయాల్లో అండగా నిలుస్తున్న ‘తత్కాల్ సెన్సార్’ విధానానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) శాశ్వతంగా బ్రేక్ వేసింది. ఈ మేరకు జూన్ 1, 2026 నుండి తత్కాల్ సర్టిఫికేషన్ ప్రక్రియను అధికారికంగా రద్దు చేస్తూ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇన్నాళ్లూ అదనపు ఫీజు చెల్లించి, ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో కేవలం కొన్ని రోజుల్లోనే సెన్సార్ క్లియరెన్స్ తెచ్చుకునే వెసులుబాటు నిర్మాతలకు ఉండేది. కానీ ఇకపై ఆ రూట్ క్లోజ్ అయిపోవడంతో, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమా సాధారణ క్యూ పద్ధతిలోనే వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నార్మల్ ప్రాసెస్‌లో సెన్సార్ సర్టిఫికెట్ రావడానికి అదనంగా 60 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

ఈ మార్పు వల్ల టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న దర్శకులు, నిర్మాతలకు పెద్ద చిక్కే వచ్చింది. ఈ మధ్య కాలంలో చాలామంది మేకర్స్ రిలీజ్ డేట్‌కు వారం, పది రోజుల ముందు వరకు రీ-రికార్డింగ్, వీఎఫ్ఎక్స్ (VFX) పనులు సాగదీస్తూ ఆఖరి నిమిషంలో తత్కాల్ ఆశ్రయించేవారు. నిర్ణయంతో సినిమా విడుదలకు కనీసం రెండు నెలల ముందే ఫైనల్ కాపీని సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే అనుకున్న తేదీకి థియేటర్లలోకి రావడం అసాధ్యం.

ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో, ఎక్కువ భాషల్లో రూపొందించిన పాన్-ఇండియా చిత్రాలకు దీని వల్ల భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. సంక్రాంతి, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగ సీజన్లను టార్గెట్ చేసే పెద్ద సినిమాల సెన్సార్ ప్రక్రియ కాస్త ఆలస్యమైనా, మొత్తం బిజినెస్ సైకిల్ తలకిందులవుతుంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్, థియేటర్ల కేటాయింపు, డిజిటల్ అగ్రిమెంట్లు మరియు ప్రమోషనల్ టూర్స్ షెడ్యూల్స్ అన్నీ అయోమయంలో పడతాయి.

అయితే పరిశ్రమలోని కొందరు ట్రేడ్ నిపుణులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తత్కాల్ ఆప్షన్ లేకపోవడం వల్ల మేకర్స్‌లో బద్ధకం పోయి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పక్కా క్రమశిక్షణ పెరుగుతుందని చెప్పారు. అలాగే ఎక్కువ డబ్బున్న పెద్ద నిర్మాణ సంస్థలకే కాకుండా, చిన్న నిర్మాతలకు సైతం సమానమైన అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కొత్త నిబంధనలకు అలవాటు పడటం చిత్ర పరిశ్రమకు సవాలే అయినప్పటికీ, భవిష్యత్తులో ఇది మంచి మార్పుకు దారితీస్తుందో లేదో చూడాలి.

2,802 Views

You may also like

Leave a Comment