

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (రామ్ చరణ్) నటించిన సరికొత్త చిత్రం ‘పెద్ది’ (పెద్ది) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా సాధించిన భారీ విజయం మెగా అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్త, మెగాస్టార్ చిరంజీవి నివాసం వద్ద పండుగ వాతావరణం. ఈ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల స్వయంగా పాల్గొని మెగా అభిమానులతో కలిసి సందడి చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
మెగాస్టార్ ఇంటి ప్రాంగణంలో అభిమానులు పెద్ద ఎత్తున క్రాకర్స్ కాలుస్తూ, ఈలలు, కేకలతో హోరెత్తించారు. ఈ వేడుకల్లో ఉపాసన ప్రత్యేకంగా కేక్ కట్ చేసి, అక్కడికి వచ్చిన చిన్నారులకు తన చేతులతో తినిపించి అభిమానాన్ని చాటుకున్నారు. మెగా లేడీ ఫ్యాన్స్ ఉపాసనకు ప్రత్యేకంగా దిష్టి తీసి తమ ఆశీస్సులు అందించిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సక్సెస్ హంగామా కేవలం మెగాస్టార్ ఇంటి వద్దే కాకుండా థియేటర్లలో అంతకుముందే మొదలైంది. బుధవారం రాత్రి జరిగిన ‘పెద్ది’ ప్రీమియర్ షో సందర్భంగా విమల్ థియేటర్ వద్ద ఒక రేంజ్ జాతర కనిపించింది. ఉపాసన కొణిదెల తన తల్లిదండ్రులతో కలిసి ఈ ప్రత్యేక ప్రీమియర్ షోను వీక్షించడానికి థియేటర్‌కు వచ్చారు. థియేటర్ లోపల అభిమానుల మధ్య సినిమా చూసిన ఉపాసన, స్క్రీన్‌పై రామ్ చరణ్ మాస్ ఎంట్రీ ఇచ్చే హై-వోల్టేజ్ సీన్ రాగానే థియేటర్ లోని మాస్ ఫ్యాన్స్ లాగే గాల్లోకి పేపర్లు ఎగరేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. మెగా పవర్ స్టార్ ఎంట్రీకి థియేటర్లు దద్దరిల్లిపోతుంటే ఉపాసన కూడా ఒక సాధారణ అభిమానిలా ఎంజాయ్ చేయడం విశేషం. షో ముగిసిన తర్వాత ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు భారీగా పోటీ పడ్డారు.