Home ఎంటర్‌టెయిన్మెంట్ నలుగురు ప్రముఖ హీరోల చేతుల మీదుగా ‘బాలన్’ ట్రైలర్ రిలీజ్! – VRM MEDIA

నలుగురు ప్రముఖ హీరోల చేతుల మీదుగా ‘బాలన్’ ట్రైలర్ రిలీజ్! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


కేవీఎన్ ప్రొడక్షన్స్, టెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “బాలన్ – ది బాయ్” (బాలన్ ది బాయ్). ఈ చిత్రం ‘ఆవేశం’ ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ స్క్రిప్ట్ అందించారు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జూన్ 19న హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే “బాలన్ – ది బాయ్” మూవీ ఫ్రాన్స్ లో జరిగే ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమై, గ్లోబల్ వేదికపై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమైనప్పటి నుంచి ఈ సినిమా గ్లోబల్ గా ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజాగా “బాలన్ – ది బాయ్” మూవీ హిందీ ట్రైలర్ ను హీరో అజయ్ దేవగణ్, తమిళ ట్రైలర్ ను హీరో సూర్య, తెలుగు ట్రైలర్ ను హీరో నాగచైతన్య, కన్నడ ట్రైలర్ ను హీరో రాజ్ బి శెట్టి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ట్రైలర్‌కి బాగా నచ్చిందని చెబుతూ మూవీ టీమ్‌కి ఈ స్టార్ హీరోలు బెస్ట్ విశేషాలు అందించారు. హ్యూమన్ ఎమోషన్స్, మనదైన నేటివిటీతో సాగిన ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఆసక్తి కలిగించే సస్పెన్స్, ఎమోషన్ వంటి అంశాలతో ట్రైలర్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది.

ప్రమోషనల్ కంటెంట్ తో “బాలన్ – ది బాయ్” సినిమా ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం.

2,801 Views

You may also like

Leave a Comment