[ad_1]
వ్యాపారం
ఓయ్-జక్కీ మహేష్
ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)కు అంతర్జాతీయంగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓ ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ కంపెనీకి చెందిన వాణిజ్య రహస్యాలను అక్రమంగా ఉపయోగించుకుందనే సుదీర్ఘ వివాదంలో టీసీఎస్ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించడానికి అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ లీగల్ యుద్ధానికి తెరపడటమే కాకుండా.. టీసీఎస్ దాదాపు 220 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో సుమారు రూ.1840 కోట్లు) భారీ ఆర్థిక నష్టాన్ని భరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఈ వివాదానికి సంబంధించిన మూలాలు 1990 నాటి అమెరికన్ లైఫ్ ఇన్సూరెన్స్ సాఫ్ట్‌వేర్ బిజినెస్‌లో ఉన్నాయి. ప్రస్తుతం డీఎక్స్‌సీగా పిలవబడుతున్న కంపెనీ పూర్వపు సంస్థ అయిన కంప్యూటర్ సైన్సెస్ ఓ ఇన్సూరెన్స్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారాన్ని ట్రాన్స్‌అమెరికా అనే బీమా దిగ్గజానికి లైసెన్స్ ఇచ్చింది. అయితే కొన్నేళ్ల తర్వాత టీసీఎస్ సంస్థ ఆ ట్రాన్స్‌అమెరికా కంపెనీ నుంచి దాదాపు 2,200 మందికి పైగా ఉద్యోగులను తనలోకి తీసుకువెళ్లింది. ఆ ఉద్యోగుల ద్వారా సీఎస్‌సీ సాఫ్ట్‌వేర్ రహస్యాలను, కోడ్‌లను దొంగిలించి, దానికి పోటీగా సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫారమ్‌ను టీసీఎస్ డెవలప్ చేసిందని డీఎక్స్‌సీ టెక్నాలజీ ఆరోపించింది.

ఈ వ్యవహారంపై డీఎక్స్‌సీ టెక్నాలజీ సంస్థ 2019లో డల్లాస్‌లోని అమెరికా ఫెడరల్ కోర్టులో టీసీఎస్‌పై కేసు వేసింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. ఆ సమాచారం రహస్యమైనదేమీ కాదని.. తాము చట్టబద్ధంగానే సాఫ్ట్‌వేర్‌ను యాక్సెస్ చేశామని టీసీఎస్ గట్టిగా వాదించింది. కానీ 2023లో యూఎస్ జ్యూరీ టీసీఎస్ ఉద్దేశపూర్వకంగానే వాణిజ్య రహస్యాలను కాజేసిందని నిర్ధారించింది. ఆ తర్వాత 2024లో యూఎస్ జిల్లా జడ్జి బ్రాంట్లె స్టార్ ఈ జరిమానాను 168 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. ఇందులో నష్టపరిహారంతో పాటు శిక్షాత్మక జరిమానా కూడా ఉంది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ టీసీఎస్ 2025లో యూఎస్ అప్పీల్స్ కోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా చుక్కెదురైంది. చివరగా ఈ తీర్పును రద్దు చేయాలనే చివరి ప్రయత్నంగా టీసీఎస్ నిన్న అమెరికా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అయితే డీఎక్స్‌సీ కంపెనీకి ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని.. అందువల్ల ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం చెల్లదని టీసీఎస్ చేసిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. టీఎస్సీఈఎస్పీల్‌ను విచారించే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో కింది కోర్టు ఇచ్చిన 168 మిలియన్ డాలర్ల తీర్పు యథాతథంగా నిలిచింది.
ఈ కోర్టు తర్వాత.. ఈ తాజా కేసుకు అదనంగా మరో 70 మిలియన్ డాలర్ల వన్‌టైమ్ ఛార్జీని కేటాయించాల్సి వస్తుందని టీసీఎస్ నిర్ణయం ప్రకటించింది. దీనితో కలిపి ఈ వివాదంలో కంపెనీ మొత్తం చెల్లింపుల భారం 220 మిలియన్ డాలర్లకు చేరుకుంది. టీసీఎస్ లాంటి ఐటీ దిగ్గజానికి ఈ ఆర్థిక భారం మార్కెట్ పరంగా తట్టుకోగలిగేదే అయినా.. అంతర్జాతీయంగా కంపెనీ ప్రతిష్టకు ఇది పెద్ద మచ్చగా మిగిలిపోతుంది.
[ad_2]