[ad_1]
భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
వాణిజ్య LPG సిలిండర్ ధర: వంటగ్యాస్ వినియోగానికి భారీ ఊరట లభించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ. 183.50 పైసల మేర తగ్గింది. తగ్గిన రేట్లు ఈ తెల్లవారు జాము నంచి అమలులోకి వచ్చాయి. కిందటి నెలలో ఒక్కో సిలిండర్ పై ఏకంగా 993 రూపాయల అదనపు మొత్తం పెరిగింది. దీన్ని పోల్చుకుంటే ఇప్పుడు తగ్గిన భారం చాలా తక్కువ.
ఈ ఏడాది కాలంలో కమర్షియల్ గ్యాస్ ధరలు వరుసగా పెరిగిన తర్వాత, ఇంత పెద్ద ఎత్తున ధరలు తగ్గడం ఇదే మొదటిసారి ప్రాధాన్యతను సంతరించుకుంది. డొమెస్టిక్ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు కూడా తగ్గిస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. పాత రేట్లే కొనసాగుతున్నాయి. వాటి ధరల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇటీవలే ఒక్కో సిలిండర్ పై 200 రూపాయల మేర అదనపు భారం మోపింది కేంద్రం.

నూతన రేట్ల ప్రకారం.. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3113.50 నుంచి రూ. 2930 కి దిగొచ్చింది. లక్నోలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,236 నుంచి రూ. 3,052.50 కు తగ్గింది. కోల్కతాలో దీని ధర రూ. 3,255.50 ఉండగా, ప్రస్తుతం రూ. 3,081.50 కి చేరింది. పాట్నాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,227 గా ఉంటోంది. 183 రూపాయల మేర తగ్గించింది.. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో కూడా కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 3,000లకు పైనే ఉన్నాయి.
గత కొద్దికాలంగా కమర్షియల్ గ్యాస్ ధరల పెరుగుదల వల్ల దేశవ్యాప్తంగా హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ధరల పెంపుతో టీ స్టాళ్ల నుంచి పెద్ద పెద్ద హోటళ్ల వరకు అన్ని చోట్ల నిర్వహణ ఖర్చులు పెరిగాయి. సుదీర్ఘ విరామం తర్వాత లభించిన ఈ తాజా తగ్గింపుతో నిర్వహణ వ్యయం కొంతవరకు తగ్గింది.
గత కొద్ది నెలలుగా చమురు వ్యాపార సంస్థలు వాణిజ్య ధరలను నిరంతరాయంగా పెంచుతూ వచ్చాయి. ఏప్రిల్, మే నెలల్లో కూడా పెద్ద ఎత్తున ఈ ధరల్లో పెంపుదల నమోదవగా, జూన్ నెలలో కూడా ఎటువంటి సానుకూల నివేదిక రాలేదు. ఈ పరిస్థితులలో జూలై మొదటి రోజునే దాదాపు రూ. 183.50 మేర భారీ తగ్గింపు లభించడం వ్యాపార వర్గాల్లో సరికొత్త ఆశలను రేకెత్తించినట్టయింది.
చమురు సరఫరా సంస్థలు ప్రతి నెల ప్రారంభంలో అంతర్జాతీయ ఇంధన ధరలు, రూపాయిని ఆధారంగా చేసుకుని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ ధరలను సవరిస్తుంటాయి. కమర్షియల్ ధరల తగ్గింపు వ్యాపార వర్గాల్లో ఊరటనిచ్చేందుకు, సామాన్య, మధ్యతరగతి గృహాలకు సైతం రానున్న రోజుల్లో డొమెస్టిక్ గ్యాస్ ధరల రూపంలో తగ్గింపు ప్రయోజనం లభిస్తుందని ఆశిస్తున్నారు.
[ad_2]