
ఆంధ్ర ప్రదేశ్
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన రంగాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో ఏవియేషన్ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడం విశేషం. ఈ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని విమానాశ్రయాల నిర్మాణం పక్కా ప్రణాళికతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతుంది.
విమానాశ్రయ విస్తరణకు సంబంధించి కీలక విషయాలపై చర్చ
దీంట్లో భాగంగా ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయి కీలక చర్చలు జరిపారు. రాబోయే 20 సంవత్సరాలలో రాష్ట్రం ఎదుర్కొనే ప్రయాణ అవసరాలను, ఆర్థిక అభివృద్ధిని, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి విమానాశ్రయ విస్తరణకు సంబంధించి అనేక కీలక విషయాలపై చర్చించారు.

రాష్ట్ర విమానయాన అభివృద్ధిపై చర్చించిన మంత్రి
రాష్ట్రంలో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయము ఉండేలా ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి నగరాల వరకు విమానయాన సౌకర్యాలు సులభంగా అందుబాటులోకి తేవడం ఈ ఆలోచన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. కొత్త విమానాశ్రయాలు, ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలను నిర్మించడం, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ విమాన సర్వీసులను పెంచడం వంటి అనేక అంశాల పైన కేంద్రమంత్రితో చర్చించారు.
వేగంగా కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుకు అనుమతులు తెలియజేయండి
ముఖ్యంగా ఈ చర్చల్లో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుకు అనుమతులు వేగంగా ఉన్నాయి. పుట్టపర్తి సమీపంలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కోసం ప్రత్యేక ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ క్లస్టర్ అభివృద్ధి చేయవలసి ఉంది. నదులు మరియు జలశయాలలో పది ప్రాంతాల్లో వాటర్ ఏరో డ్రోమ్ లు అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హెలి పోర్టుల అభివృద్ధికి కేంద్ర సహకారం అందించాలని సూచించారు.
విమాన రంగ అభివృద్ధి సాధ్యమైతే ఉపాధి అవకాశాలు
జైంట్ వెంచర్ల ద్వారా స్థానిక విమానాశ్రయాలను ఆధునీకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్ధి సాధ్యమైతే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వర్తక వాణిజ్యాలకు, పర్యాటకానికి ఊతం లభిస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అయితే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మంచి బీసీ జనార్దన్ రెడ్డి చర్చించిన అంశాల పైన సానుకూలంగా స్పందించారు.