Home ట్రెండింగ్ మమత బెనర్జీకి బిగ్ ఝలక్- పార్టీలో నంబర్ 2 అవుట్ | తృణమూల్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య అన్ని పదవుల నుంచి తప్పుకోవడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. – VRM MEDIA

మమత బెనర్జీకి బిగ్ ఝలక్- పార్టీలో నంబర్ 2 అవుట్ | తృణమూల్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య అన్ని పదవుల నుంచి తప్పుకోవడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. – VRM MEDIA

by VRM Media
0 comments
మమత బెనర్జీకి బిగ్ ఝలక్- పార్టీలో నంబర్ 2 అవుట్ | తృణమూల్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య అన్ని పదవుల నుంచి తప్పుకోవడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.


భారతదేశం

ఓయ్-చంద్రశేఖర్ రావు

పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష పార్టీ తృణమూల్ కాంగ్రెస్ లో తీవ్ర రాజకీయ ఉత్కంఠ. పార్టీలో చెలరేగిన అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. రితబ్రత బెనర్జీ అనుమతిని తిరుగుబాటు వర్గం కోల్కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలోకి కూడా తీసుకువెళ్లింది. కార్యాలయానికి తాళం వేసింది. అసలైన తృణమూల్ కాంగ్రెస్ తమదేనని, కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించిందని తిరుగుబాటు నేతలు ప్రకటించారు.

ఈ పరిణామాల మధ్య తృణమూల్ కాంగ్రెస్ లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్టీ సీనియర్ నాయకురాలు, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, మాజీ మంత్రి చంద్రిమ భట్టాచార్య గుడ్ బై చెప్పారు. పార్టీలో ఉన్న తన అన్ని పదవులకు రాజీనామా చేశారు. సుదీర్ఘ కాలంగా మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలైన సహచరురాలిగా ఉన్న చంద్రిమా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పార్టీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

తృణమూల్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య అన్ని పదవుల నుంచి తప్పుకోవడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

కోల్‌కతా మెట్రోపాలిటన్ భవన్ వివాదంలో ఆమె ప్రమేయం ఉందంటూ స్వయంగా పార్టీ, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానించడమే చంద్రిమా భట్టాచార్య ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని సమాచారం. ఈ మెట్రోపాలిటన్ భవన నియంత్రణ కోసం పార్టీలో మమత బెనర్జీ వర్గం, రితబ్రత వర్గానికి మధ్య మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంలో చంద్ర భట్టాచార్య పాత్రపై మమతా బెనర్జీ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తృణమూల్ అంతర్గత రాజకీయాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం బెంగాల్ తీవ్ర చర్చకు దారితీసింది. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలిగా, కీలక సహచరురాలిగా ఉంటూ వచ్చిన చంద్రిమ.. ఇలా అర్ధాంతరంగా పార్టీ బాధ్యతల నుంచి దూరం కావడం చర్చనీయాంశమైంది. దీంతో మమత బెనర్జీ ఇక రాజకీయంగా మరింత ఒంటరి అయ్యారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ వివాదం ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

ఇటీవలే ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రిమా భట్టాచార్య తన ఆవేదనను పంచుకున్నారు. పార్టీలో ఓ క్రమశిక్షణ కలిగిన సైనికురాలిగా బాధ్యతాయుతంగా వ్యవహరించానని, మారుమూల గ్రామాల్లో సైతం పార్టీ కార్యకలాపాలను తీసుకెళ్లానని తెలిపారు. పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశానని చెప్పారు. జూన్ 3వ తేదీన తనను రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించినప్పటి నుండి, ఒకటి రెండు రోజులు మినహాయించి ప్రతిరోజూ తాను మెట్రోపాలిటన్ కార్యాలయానికి విధులు నిర్వర్తించానని స్పష్టం చేశారు.

2,802 Views

You may also like

Leave a Comment