Home Uncategorized జర్నలిస్టుల సంక్షేమానికి సమష్టి కృషి అవసరంహర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

జర్నలిస్టుల సంక్షేమానికి సమష్టి కృషి అవసరంహర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

by VRM Media
0 comments

vrm media ప్రతినిధి రాంబాబు ఖమ్మం

హైదరాబాద్, జూలై 5:-జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు, మీడియా యాజమాన్యాలు, పాత్రికేయ సంఘాలు సమన్వయంతో పనిచేయాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని హైబిట్స్ లో గల తెలంగాణ సరస్వత పరిషత్ ఆడిటోరియం
రాష్ట్ర జర్నలిస్టుల కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
నిజాయితీ, నిబద్ధతతో వార్తలను ప్రజలకు అందించే పాత్రికేయుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలని సూచించారు. జర్నలిస్టులకు ఆరోగ్య బీమా, గృహ వసతి, పెన్షన్, ప్రమాద బీమా వంటి సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని కోరారు.

రైల్వే పాసుల పునరుద్ధరణ అంశాన్ని మళ్లీ కేంద్రం దృష్టికి తీసుకెళ్తా…
జర్నలిస్టులకు గతంలో అమలులో ఉన్న రైల్వే ప్రయాణ రాయితీ పాసుల పునరుద్ధరణ అంశాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. రాష్ట్ర జర్నలిస్టుల కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ అంశాన్ని గతంలోనూ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు. జర్నలిస్టుల వృత్తిపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే పాసుల సౌకర్యాన్ని పునరుద్ధరించాలని మరోసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, వారి వృత్తిపరమైన సౌకర్యాల కోసం తనవంతు కృషి కొనసాగుతుందన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన జర్నలిస్టు ప్రతినిధులు తమ సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంఘటితంగా కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర టీజెఏ అడ్వయిజరి కమిటీ చైర్మెన్ ఉప్పల లక్ష్మణ్ మాట్లాడుతూ… టి జే ఏ ను ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందని, అన్ని జిల్లాలో అక్రిడిటేషన్ కమిటీలు వేశామని, డిఎంఏసీ. కమిటీలు జిల్లాలో టి జే ఏ సభ్యత్వం పెంచాలన్నారు. టి జే ఏ ను ప్రభుత్వం గుర్తించినందుకు ప్రభుత్వనికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎన్ యూ జే (ఐ) కృషి చేస్తుందని ఎన్ యూ జే (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు ఉక్కల్కర్ రాజేందర్ నాథ్ మాట్లాడుతూ అన్నారు. జర్నలిస్ట్ రైల్వే పాస్ ల గురించి పలుమార్లు కేంద్రం మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాం అన్నారు. టి జే ఏ అక్రిడిటేషన్ జిల్లా కమిటీలకు పలు సూచనలు చేసారు. టి జే ఏ కు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చినందుకు సీఎం.రేవంత్ రెడ్డి కి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, టి జే ఏ కు ప్రభుత్వ గుర్తింపు కోసం సహకారం అంధుబచిన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కు కృతజ్ఞతలు తెలిపారు.
టి జే ఏ రాష్ట్ర అధ్యక్షులు రమణ రావు మాట్లాడుతూ… రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీ సభ్యునిగా అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ వచ్చేలా చేస్తున్నాం అన్నారు. సమిష్టి కృషి వల్ల ప్రభుత్వం టి జే ఏ ను గుర్తించిందన్నారు. జిల్లాలో జర్నలిస్టుల సమస్యలపై తమ దృష్టికి తేవాలన్నారు. జిల్లా అక్రిడిటేషన్ కమిటీల సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ నిజమోద్దీన్ మాట్లాడుతూ…జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి ఉంటుందన్నారు. తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్. ఏ ఎస్ రావు జర్నలిస్తుల సంక్షేమం పై మాట్లాడారు.

ఈ సమావేశంలో ఎన్ యూ జే (ఐ )కార్యవర్గ సభ్యుడు ధన్నారపు రాజలింగం, టిజేఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరీ, టి జేఏ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు ఖాసీం, కార్యదర్శి నాగస్వామి,
కోశాధికారి ఖలీల్ అహ్మద్, టి జే ఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు చింతల నీలకంఠం, పలు జిల్లాల డిస్ట్రిక్ట్ అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

About Us

We're a media company. We promise to tell you what's new in the parts of modern life that matter. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo. Sed consequat, leo eget bibendum sodales, augue velit.

Facebook Twitter Youtube Linkedin Instagram

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs

Recent Articles

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs Daily horoscope: Your star sign reading, astrology and zodiac forecast Theory: Tom Holland’s Peter Parker replaced by Miles Morales in next trilogy

Featured

Latest box office bomb ‘will lose $100 million’ amid ongoing pandemic England vs South Africa free live stream: Watch Autumn Nations Series online White House plan aims to protect science from politics with new approach @2022 - All Right Reserved. Designed and Developed by PenciDesign