
తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు. తన రాజకీయ కార్యాచరణ పైన తేల్చి చెప్పేసారు. మంత్రి పదవి దక్కలేదనే కారణంతో ఆగ్రహంగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కొంత కాలంగా పలు వ్యాఖ్యలు చేసారు. పార్టీలోనూ చర్చకు కారణమయ్యారు. తనకు హామీ ఇచ్చి మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తాజాగా సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ తరువాత రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ లక్ష్యం స్పష్టం చేసారు.
వరుసగా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీ కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన కోసం ప్రయత్నం చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాం పార్టీని బలోపేతం చేసే విషయంలో రాజీ పడమని స్పష్టం చేసారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి అన్యాయం జరుగుతుందనేది తమ ఆలోచనగా చెప్పుకోవాలి. యాదగిరిగుట్ట విషయం తప్పనిసరి పరిస్థితులలో మాట్లాడాల్సి వచ్చింది అది పార్టీ మీద వ్యతిరేకమో ప్రభుత్వం మీద వ్యతిరేకమో కాదని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని బలపరిచారు.. వచ్చే ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తాను పని చేస్తానని.

రాహుల్ ను ప్రధాని చేయటమే లక్ష్యంగా
అదే విధంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని రాజ గోపాల్ రెడ్డి స్పష్టం చేసారు. తాను పార్టీకి దూరంగా ఉంటున్నానన్న మాటల్లో వాస్తవం లేదని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటున్నానని వివరించారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్ణయాలను తప్పుపడుతున్నాను.. పార్టీని కాదని స్పష్టత ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ నాయకునికి రాహుల్ గాంధీ అంత సమయం ఇవ్వలేదని.. తనకు పార్టీ లో ఆ స్థానం ఉందని చెప్పుకొచ్చారు . రాహుల్ గాంధీతో పార్టీ నిర్ణయాలు, కుటుంబ విషయాలు చాలా చర్చించాలని రాజగోపాల్ రెడ్డి కోసం. దీని ద్వారా రాజగోపాల్ మనసు మార్చుకున్నారని.. కాంగ్రెస్ లోనే కొనసాగుతుందని స్పష్టం అవుతుందనే వాదన పార్టీ నేతల్లో వినిపిస్తోంది.