Home ట్రెండింగ్ తెలంగాణలోని పేదలకు కేంద్రం భారీ శుభవార్త | pmay తెలంగాణకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 తెలంగాణ కింద 8,338 గృహాలు ఆమోదించబడ్డాయి – VRM MEDIA

తెలంగాణలోని పేదలకు కేంద్రం భారీ శుభవార్త | pmay తెలంగాణకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 తెలంగాణ కింద 8,338 గృహాలు ఆమోదించబడ్డాయి – VRM MEDIA

by VRM Media
0 comments
తెలంగాణలోని పేదలకు కేంద్రం భారీ శుభవార్త | pmay తెలంగాణకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 తెలంగాణ కింద 8,338 గృహాలు ఆమోదించబడ్డాయి


తెలంగాణ

ఓయ్-బొమ్మ శివకుమార్

ఇళ్లు అనేది లక్షలాదిమంది పేద, మధ్య తరగతి ప్రజలకు ఓ ఎమోషన్.. సొంతిళ్లు కట్టుకోవడం ఓ కలగా పెట్టుకుంటారు. రూపాయి రూపాయి పోగేసి ఇళ్లు కట్టుకోవడమే వారి జీవితాశయంగా ఉంటారు. ఇప్పటికీ సొంతిళ్లు లేని పేద, మధ్య తరగతి కుటుంబాలు రాష్ట్రంలో ఉన్నాయి. దాంతో అటు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పేరుతో పేదలకు ఇళ్లు కట్టిస్తోంది. అలాగే కేంద్రం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కూడా రాష్ట్రంలోని పేదలకు సొంతింటి కల నెరవేరుతోంది. ఈ ప్రయోజనాలనే తెలంగాణలోని పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. అదేంటి అంటే..? ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై)-పట్టణ 2.0 పథకం కింద తెలంగాణకు మరో 8,338 ఇళ్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.

ఇటీవల కేంద్ర గృహ నిర్మాణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించి ఈ మేరకు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రూ. 125 కోట్ల ఆర్థిక సాయం అందించింది. ఈ మొత్తంలో తొలి విడతలో భాగంగా రూ. 50 కోట్లను రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణాలు ఈ ఏడాది సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత జరిగే పనులకు సాయం ఉండదని. ఇక గతంలో కేంద్ర కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 4.30 లక్షల ఇళ్లను కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

PMAY తెలంగాణకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 8 338 గృహాలు ఆమోదం పొందాయి.

ఇక ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం సొంతిళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తోంది. అర్హులైన ప్రతి కుటుంబం కేంద్ర ప్రభుత్వం ఈ సాయం పొందొచ్చు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల ఇళ్లు కట్టుకునేవారికి ప్రభుత్వం 1.20 లక్షల రూపాయలు సాయం అందిస్తుంది. అలాగే పట్టణాల్లో నివసించే వారికి 1.50 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తోంది. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం చొప్పున నిధులను భరిస్తుంటాయి.

2,801 Views

You may also like

Leave a Comment