Home ఎంటర్‌టెయిన్మెంట్ జయం రవి కీలక నిర్ణయం… అభిమానులు క్షమించాల్సిందే – VRM MEDIA

జయం రవి కీలక నిర్ణయం… అభిమానులు క్షమించాల్సిందే – VRM MEDIA

by VRM Media
0 comments
జయం రవి కీలక నిర్ణయం... అభిమానులు క్షమించాల్సిందే


తెలుగు, తమిళ ప్రేక్షకులకి ‘జయం రవి’గా సుపరిచితుడైన స్టార్ హీరో రవి మోహన్ గత సినిమాల కంటే తన వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ వచ్చారు. ముఖ్యంగా భార్య ఆర్తీ రవితో విడాకుల, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదొడుకుల నేపథ్యంలో ఆయన గతంలో ఒక వివాదంలో సంచలన ప్రకటన చేశారు. విడాకుల వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చేంతవరకు నటనకి స్వస్తి పలుకుతున్నానని, సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇస్తున్నట్లు భావోద్వేగంగా ప్రకటించి అభిమానులకి తీవ్ర నిరాశకు గురిచేశారు. అయితే, తాజాగా ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు చెన్నైలో జరిగిన జెఎఫ్‌డబ్ల్యూ (JFW) అచీవర్స్ అవార్డ్స్ వేడుకలో రవి మోహన్ స్టేజీపైనే ఎంతో ఎమోషనల్ అవుతూ తన అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

ఈ ఏడాది తాను 46వ వసంతంలోకి అడుగుపెడుతున్నాను. తన జీవితంలో సగం కాలం అంటే ఏకంగా 23 సంవత్సరాల పాటు సినిమా పరిశ్రమలోనే గడిపాను. నా జీవితంలో 50 శాతం వ్యక్తిగత జీవితానికి, 50 శాతం వృత్తిపరమైన సినిమా జీవితానికి సమాన ప్రాధాన్యత ఇస్తాను. అయితే ఇటీవల వ్యక్తిగత జీవితంలో భావోద్వేగాలు శృతిమించి ఒక చిన్న పొరపాటు నిర్ణయం తీసుకున్నాను. ఆ ఒక్క ఎమోషనల్ నిర్ణయం తనను ప్రాణంగా ప్రేమించే అభిమానులను, చిత్ర పరిశ్రమను ఎంతగానో బాధించింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన తోటి నటీనటులు, దర్శకులు తన వద్దకు వచ్చి, “నువ్వు ఏమైనా అనుకో.. కానీ సినిమాలను వదిలేస్తానని ఎప్పుడూ అనకు” అని సర్దిచెప్పడం వల్లే తనలో మళ్లీ కొత్త నమ్మకం కలిగింది.

ఇది కూడా చదవండి: డైరెక్టర్‌పై పగబట్టిన స్టార్ హీరో ఫ్యాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రివెంజ్ స్టోరీ!

అభిమానులని ఉద్దేశించి మాట్లాడుతూ, ఇకపై అభిమానులని ఎప్పటికీ బాధపెట్టాను. సినిమా రంగానికి ద్రోహం చేయనని మోకాళ్లపై నిలబడి మరీ క్షమాపణలు. తన కష్టకాలంలో అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ తలవంచి కృతజ్ఞతలు తెలుపుతూ, త్వరలో మరింత శక్తివంతంగా వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం రవి మోహన్ చేతిలో వరుస భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయన నటిస్తున్న ‘కరాటే బాబు’ చిత్రం ఆగస్టు 28న విడుదలకి సిద్ధమవుతోంది. దానితో పాటు ఎంతో కాలంగా ఉన్న సోషియో ఫాంటసీ మూవీ ‘జీని’ (Genie) కూడా నిర్మాణంలో ఉంది. వీటన్నింటికీ మించి, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీ’ (LCU) లో భాగమైన ‘బెంజ్’ (బెంజ్) చిత్రంలో రవి మోహన్ ఒక కీ రోల్ పోషించబోతున్నారు. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రవి ఈ మల్టీస్టారర్ మూవీ ద్వారా మోహన్ తన పవర్ ఫుల్ రీఎంట్రీని ఖరారు చేశారు. లోకేష్ కనగరాజ్ ఈ ప్రాజెక్ట్‌లోకి ఆయనను ఆహ్వానించడం విశేషం.

2,802 Views

You may also like

Leave a Comment