

20 ఏళ్ల క్రితం కుర్రకారుని ఒక ఊపు ఊపేసిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మన్మధ'(మన్మధ). పన్నెండేళ్ల వయసు వాళ్ళు కూడా టికెట్ల కోసం థియేటర్ దగ్గర తిష్ట వేసి మరి చూశారంటే మన్మధ ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు వంటి ప్రాంతాల్లో అయితే చాలా రోజులు హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. మెంబర్ ఆఫ్ సెంటర్స్ లో అర్ధ శతదినోత్సవం కూడా జరుపుకుంది. శింబు, జ్యోతిక జంటగా చేసారు.
జూలై 18న ఆంధ్రప్రదేశ్, నైజాం ప్రాంతాల్లో రీ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం అధికారకంగా స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రమోషన్లు కూడా మొదలయ్యాయి.నేటి జనరేషన్ ప్రేక్షకులు ఎగబడి చూస్తున్న రొమాంటిక్ సైకో థ్రిల్లర్ జోనర్‌కి 2004లోనే ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పుడొస్తున్న ‘ఆర్ఎక్స్ 100’, ‘బేబీ’ వంటి సినిమాల కంటే చాలా భిన్నమైన, బలమైన కథాంశంతో, అద్భుతమైన ట్విస్టులతో అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు ఉన్నాయి. కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన తమిళ్‌తో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఊహించని రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించింది. శింబు ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) లో అద్భుతంగా నటించి మెప్పించారు. ప్రేమికుడిగా అమాయకత్వాన్ని, సైకో కిల్లర్‌గా క్రూరత్వాన్ని శింబు పండించిన తీరు ఇప్పటికీ ప్రేక్షకులకి గుర్తిండిపోయింది.
ఈ చిత్రం ఏ.జె. మురుగన్ దర్శకత్వం వహించాడు, హీరో శింబు స్వయంగా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. శింబు కెరీర్‌లోనే మైల్‌స్టోన్‌గా నిలిచిన ఈ సినిమా విజయానికి మరో ముఖ్య కారణం సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా. అందించిన ప్రతీ పాట, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఒక అద్భుతం. ముఖ్యంగా లవ్ థీమ్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఎలివేట్ చేసే మ్యూజిక్ ప్రేక్షకుల థియేటర్లలో కట్టిపడేసింది. ఇరవై ఏళ్లు దాటినా ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. సింధు తులాని, మందిరా బేడి, అతుల్ కులకర్ణి, యాగా గుప్త వంటి వారు కీ రోల్స్ పోషించారు. ఇప్పటికే పలు డబ్బింగ్ సినిమాలు రీ-రిలీజ్‌లో తెలుగు బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్స్ సాధించాయి, మరి జూలై 18న థియేటర్లలోకి రాబోతున్న ఈ కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి. ఒకరితో ప్రేమలో ఉండి మరొకరితో శృంగారం చేసే యువతులే టార్గెట్ గా చిత్ర కధాంశం తెరకెక్కించారు.