
తెలంగాణ
ఓయి-లింగారెడ్డి గజ్జల
తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఒక కీలక అప్‌డేట్. రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఉమ్మడిగా రేపు (శుక్రవారం, జూలై 10) రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని, ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడుతున్నాయి. అయితే, ఈ బంద్ కారణంగా కొన్ని స్కూళ్ల విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడం విశేషం.
ఈ ఏడాది వేసవి సెలవులను పొడిగించిన కారణంగా తలెత్తిన పనిదినాల కొరతను భర్తీ చేయడానికి, ఈ నెలలో వచ్చే రెండో శనివారం వర్కింగ్ డే (పనిదినం)గా మారుస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం ఆరోజు సెలవులు ప్రకటించాయి. ఈ రోజు రేపు శుక్రవారం బంద్ కావడం, శనివారం కొన్ని స్కూళ్లు సెలవులు ఇవ్వడం, ఆ మరుసటి రోజు ఆదివారం సాధారణ సెలవు కావడంతో.. విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు లాంగ్ వీకెండ్ దొరికినట్లైంది.

అసలు విద్యార్థి సంఘాల డిమాండ్లు ఏమిటి?
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పీడిస్తున్న పలు ప్రధాన సమస్యలపై ప్రభుత్వం స్పందించాలంటూ విద్యార్థి సంఘాల నేతలు ఈ నిరసనకు దిగారు. వారి ముఖ్యమైన డిమాండ్లు ఇలా ఉన్నాయి
- ప్రభుత్వ పాఠశాల తగ్గింపుపై అభ్యంతరం: ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 27 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటి సంఖ్యను కేవలం 4 వేలకు పైగా ప్రభుత్వం చూస్తోందని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
- ఫీజుల నియంత్రణ చట్టం: ప్రైవేటు, విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా పెంచుతున్న ఫీజులను అరికట్టేందుకు తక్షణమే కఠినమైన చట్టాలను తీసుకురావాలి.
- మంత్రి కేటాయింపు & పోస్టుల భర్తీ: విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని కేటాయించడంతో పాటు, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.
- సొంత భవనాలు & ఉచిత ప్రవేశాలు: అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. విద్యాహక్కు చట్టం (RTE) ప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలి.
- మధ్యాహ్న భోజనం & దోపిడీ నియంత్రణ: ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి. అలాగే ప్రైవేట్ స్కూళ్లలో విచ్చలవిడిగా పుస్తకాలు, నోట్ బుక్స్ విక్రయించి తల్లిదండ్రులను దోచుకునే విధానాన్ని అడ్డుకోవాలి.
ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రేపు చేపట్టే విద్యాసంస్థల బంద్‌కు అన్ని యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించి విజయవంతం చేసిన విద్యార్థి సంఘాల నేతలు.