Home ఎంటర్‌టెయిన్మెంట్ సోగ్గాడు ఇంట తీవ్ర విషాదం.. శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత.! – VRM MEDIA

సోగ్గాడు ఇంట తీవ్ర విషాదం.. శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత.! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


తెలుగు చిత్ర పరిశ్రమ సోగ్గాడు, దివంగత నటుడు శోభన్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం. ఆయన సతీమణి శాంతకుమారి (86) చెన్నైలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భర్త స్టార్ ఇమేజ్‌తో ఇండస్ట్రీని ఏలుతున్నా.. ఎప్పుడూ ప్రచారానికి, ఆడంబరాలకు దూరంగా ఉంటూ, సాధారణ గృహిణిగా జీవించిన ఆమె ప్రస్థానం ఎందరికో ఆదర్శం.

శోభన్ బాబు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే, అంటే 1958 మే 15న శాంత కుమారితో ఆయన వివాహం జరిగింది. ఆయన సినీ కెరీర్ ప్రారంభ దశ నుంచి అగ్ర హీరోగా ఎదిగే వరకు శాంతకుమారి ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. ఒక స్టార్ హీరో భార్య అయి ఉండి కూడా శాంతకుమారి ఎప్పుడూ మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. 2008లో శోభన్ బాబు మరణించిన తర్వాత కూడా ఆమె చెన్నైలోనే ఉంటూ తన పిల్లలతో కలిసి చాలా నిరాడంబరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు,

శాంతకుమారి మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, శోభన్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

శోభన్ బాబు భార్య శాంత కుమారి కన్నుమూశారు

2,801 Views

You may also like

Leave a Comment