
రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని ‘రక్త చరిత్ర’ సినిమా తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ చేసిన తర్వాతే ఈ సినిమాను మొదలుపెట్టాం. నా కెరీర్‌లో చాలా స్పెషల్ సినిమా ఇది” అని సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా 2010లో విడుదలై అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ, “శాంతికి, యుద్ధానికి మధ్య ఉన్నఅంతరాన్ని చర్చిస్తూ, యుద్ధం వల్ల జరిగే నష్టాన్ని ఇందులో చూపించాం.
ఇక ‘రక్త చరిత్ర’ పార్ట్-3 సినిమా తీసే అవకాశం లేదు. ఎందుకంటే పార్ట్-2లో వాళ్లు అందరూ పోయారు. ఎవరూ లేరు. ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు” అని చెప్పుకొచ్చారు. ఇదే ప్రెస్ మీట్‌లో పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు రామ్‌గోపాల్‌వర్మ తనదైన రీతిలో సమాధానమిచ్చారు. ఇప్పుడు రాయలసీమలో ఫ్యాక్షనిజం కనుమరుగైంది. దమ్ము ఎవరికీ లేదని అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు డైరెక్టర్‌కు అధిక ప్రాధాన్యత ఉండేది. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనే వారు…మరి నేడు స్టార్ డామినేషన్ ఎక్కువైంది. దీనికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు వర్మ బదులిస్తూ…డైరెక్టర్‌కు ఏమైనా కిరీటం ఉంటుందా!. స్టార్ ముఖం చూసి ప్రేక్షకులు టిక్కెట్లు కొంటున్నప్పుడు…కోట్లాది రూపాయల బిజినెస్ స్టార్ మూలంగా జరుగుతున్నప్పుడు సహజంగానే స్టార్ డామినేషన్ ఉండటంలో ఎలాంటి తప్పు లేదు. అది కరెక్ట్ కూడా. డైరెక్టర్ స్టార్‌ను కన్విన్స్ చేసే కెపాసిటీ ఉందా? లేదా? అన్నదే ఇంపార్టెంట్.
నా జీవితంలో ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు ఎప్పటికీ తీయను. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు ఎవరి కోసం తీయాలి. ఒక కుటుంబం థియేటర్‌కు వెళితే…భర్త ఏమో హీరోయిన్‌ను చూస్తుంది, భార్య ఏమో హీరోయిన్ వేసుకున్న కాస్ట్యూమ్స్‌ను చూస్తుంది. ఇక కొడుకు ఏమో ఎందుకొచ్చామురా అని బోరింగ్‌గా ఫీల్ అవుతాడు. అందుకే ఫ్యామిలీ సెంటిమెంట్ సబ్జెక్టుల జోలికి వెళ్లదలచుకోలేదు. ఇక పౌరాణిక సినిమాలు అంటారా? వాటిని తీసే ఓపిక నాకు లేదు. పౌరాణికాలకు భారీ కాస్ట్యూమ్స్, బోలెడంత గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుందనే కారణంగానే నేను వాటి గురించి ఎప్పటికీ ఆలోచించను. రియలిస్టిక్ డ్రామాలు మాత్రమే తీస్తాను. ప్రస్తుతం హిందీలో కాప్స్ స్టోరీతో సినిమా చేస్తున్నాను. అందుకే ముంబైలో ఉంటున్నా” అంటూ వర్మ వివరించారు.
నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ.. ఒకప్పుడు రాయలసీమలో రెండు వర్గాలు ఎలా కత్తులు దూసుకుపోతున్నాయి. దానివల్ల మారణ హోమం జరిగిందన్న రక్త చరిత్ర సినిమాలో వర్మ చాలా చక్కగా చూపించారు. అప్పట్లో బ్లాక్ బస్టర్ అయిన ఈ జనరేషన్‌కి కూడా చూపించాలన్న ఉద్దేశ్యంతో రీ రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు నట్టి కుమార్, మురళీకృష్ణ వంకాయలపాటి తెలిపారు. అత్యధిక థియేటర్లలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని, శనివారం సాయంత్రం4 గంటలకు టిక్కెట్ల బుకింగ్ ఓపెన్ చేస్తున్నామని చెప్పారు.