[ad_1]

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి దూసుకుపోతోంది. ఈ సినిమా ఘన విజయం అక్కినేని సరికొత్త జోష్ నింపింది. ఈ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో కింగ్ అక్కినేని నాగార్జున మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా క్రెడిట్‌ను తన చిన్న కోడలికి అప్పగించడం ఆసక్తికరంగా మారింది.
అఖిల్ జైనాబ్ రావ్‌డ్జీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత అఖిల్ నుంచి వచ్చిన మొదటి లెనిన్ కావడం విశేషం. కెరీర్ స్టార్టింగ్ భారీ కమర్షియల్ సక్సెస్ కోసం ప్రస్తుతం అఖిల్ కి.. లెన్ తో అది నెరవేరింది. ఆ ఆనందంలోనే తన కొడుకు లెనిన్ సక్సెస్ క్రెడిట్ ని కోడలికి ఇచ్చేశాడు నాగార్జున.
“అఖిల్ కి పెద్ద సర్జరీ అయ్యింది. ఆ తర్వాత మనిషి కామ్ అయిపోయాడు. కామ్ గా ఆలోచించడం మొదలుపెట్టాడు. అదే టైంలో తనకి ఒక తోడు వచ్చింది. అప్పటి నుంచి గుడ్ టైం స్టార్ట్ అయింది. బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటాడు. ఇదే కంటిన్యూ చేస్తే, భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తాడు.” అని నాగార్జున మాట్లాడాడు.
అఖిల్ లైఫ్ లోకి ఒక తోడు వచ్చాక, గుడ్ టైం స్టార్ట్ అయిందని నాగార్జున మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. “లెనిన్ సక్సెస్ క్రెడిట్ చిన్న కోడలికి ఇచ్చిన నాగార్జున” అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
అఖిల్ అక్కినేని, లెనిన్ మూవీ, నాగార్జున, తెలుగువన్
[ad_2]