Home ఎంటర్‌టెయిన్మెంట్ హాట్ పిక్స్‌తో సెగలు రేపుతున్న రమ్య మోక్ష.. వెండితెరపై మెరిసేందుకు క‌స‌ర‌త్తు.! – VRM MEDIA

హాట్ పిక్స్‌తో సెగలు రేపుతున్న రమ్య మోక్ష.. వెండితెరపై మెరిసేందుకు క‌స‌ర‌త్తు.! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


ప్రస్తుత రోజుల్లో వెండితెర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో సోషల్ మీడియా బ్యూటీలు గ్లామర్ అండ్ పాపులారిటీతో దూసుకుపోతున్నారు. కేవలం ఒకే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ రీల్ లేదా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వీడియోతో ఓవర్‌నైట్ సెలబ్రెటీలుగా మారిపోతున్న ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు. ఇప్పటికే దీపికా పిల్లి, వైష్ణవి చైతన్య, చాందిని చౌదరి లాంటి ఎందరో భామలు సోషల్ మీడియా నుంచే వచ్చి ఈరోజు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా స్థిరపడ్డారు. అదే దారిలో పయనిస్తూ, ప్రస్తుతం గ్లామర్ ఇండస్ట్రీలో సరికొత్త సంచలనంగా మారింది బిగ్ బాస్ బ్యూటీ రమ్య మోక్ష. తెలుగు రాష్ట్రాల్లో కేవలం ‘రమ్య మోక్ష’ అనే పేరు, ‘పచ్చళ్ళ పాప’ అంటే ఈమెను గుర్తుపట్టని నెటిజన్ ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఆ మధ్య సోషల్ మీడియాలో ‘అలేఖ్య చిట్టి పికిల్స్’ పేరుతో పచ్చళ్ల వ్యాపారం మొదలుపెట్టిన ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఒకరైన రమ్య మోక్ష, అతి తక్కువ సమయంలోనే నెత్తింట విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఒక కస్టమర్ తో జరిగిన వివాహాస్పద చాట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమెకు నెగిటివిటీతో పాటు విపరీతమైన పాపులరిటీ కూడా దక్కింది. ఆ క్రేజ్‌తోనే రమ్య మోక్ష బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో అయిన ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 9’ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. హౌస్‌లోకి అడుగుపెడుతూనే తన అగ్రెసివ్ ఆటతీరుతో, తోటి కంటెస్టెంట్లపై చేసిన బోల్డ్ కామెంట్ల వల్ల హౌస్‌లో రెండు వారాల పాటు గట్టిగానే హడావిడి చేసింది.

అయితే, బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తర్వాత కూడా రమ్య మోక్ష క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అశ్విన్ బాబు హీరోగా వచ్చిన ‘వచ్చినవాడు గౌతమ్’ సినిమాలో ఈ చిన్నది నటించినప్పటికీ, వెండితెరపై సోషల్ మీడియాలోనే ఈ భామకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. నిత్యం జిమ్‌లో కఠినమైన వర్కౌట్లు చేస్తూ, తన పర్‌ఫెక్ట్ ఫిట్‌నెస్ అండ్ కర్వీ బాడీకి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా రమ్య మోక్ష తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన గ్లామరస్ ఫోటోషూట్ పిక్స్ నెట్టింట కార్చిచ్చు రేపుతున్నాయి.

ముఖ్యంగా పింక్ కలర్ మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో బ్యాక్ లెస్ అందాలను ఆరబోస్తూ రమ్య ఇచ్చిన హాట్ స్టిల్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఒక్క సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ, తన మైండ్ బ్లోయింగ్ గ్లామర్‌తో స్టార్ హీరోయిన్‌లను సైతం బీట్ చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇన్ స్టా వేదికగా ఈమె షేర్ చేసిన ఈ బ్యాక్ లెస్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ అన్నింటిలోనూ టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి. హీరోయిన్ మెటీరియల్‌కు కావాల్సిన అన్ని అర్హతలు రమ్య మోక్షకు ఉన్నాయని, త్వరలోనే ఈ పచ్చళ్ళ పాప సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా మెరవడం ఖాయమని ఆమె అభిమానులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

2,801 Views

You may also like

Leave a Comment