Home ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు వర్ణాణీతం న్యాయం చేయండి

వీళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు వర్ణాణీతం న్యాయం చేయండి

by VRM Media
0 comments

నేడు కలెక్టర్ కు వినతి పత్రం న్యాయం చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకం…?

పాడేరు (అల్లూరి జిల్లా) న్యూస్ :VRM Midea

అల్లూరి జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం స్థానిక ఐటీడీఏలో నేడు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 16 పంచాయితీలకు సంబంధించి సుమారు 1000 గ్రామాల గిరిజనులు సంత బయలు మండలంగా ప్రకటించాలని నేడు అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ & ఐటిడిఏ ఇన్చార్జి పిఓ అభిషేక్ గౌడ్ కు ఆయా గ్రామాల గిరిజనులు వారు పడుతున్న సమస్యలు ఇబ్బందులు తెలియజేసి వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా ఆయా గ్రామాల గిరిజనులు మీడియాతో మాట్లాడుతూ మా పరిసర ప్రాంతాల్లో 16 పంచాయతీలకు సంబంధించిన గిరిజనులు అనారోగ్యం బారిన పడి వైద్యం నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాలన్న, సంబంధిత కార్యాలయాలకు వెళ్లాలన్న వివిధ పనులు నిమిత్తం వెళ్లాలన్న, చివరికి నిత్యవసర సరుకులు కొనాలన్నా సుమారు 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని, అంతేకాకుండా బస్సు సౌకర్యం కూడా లేక మేము పడుతున్న సమస్యలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణాణితమని అంతే కాకుండా మా ప్రాంతంలో ఒకే దగ్గర ఉన్న పంచాయతీలు విభజన చేసి మూడు మండలాల్లో కలిపారని ఈ సమస్యలను కూడా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. నేటి కూటమి ప్రభుత్వం మండలాల విభజనకు శ్రీకారం చుట్టిన తరుణంలో దయచేసి ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం మండలాల విభజనలో మా 16 పంచాయతీలకు అనుకూల ప్రదేశం అయినటువంటి గుత్తులుపుట్టు ప్రధాన కేంద్రంగా తీసుకొని మండలం ఏర్పాటుచేసి మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. లేనియెడల సుమారు వెయ్యి గ్రామాల గిరిజనులు మమేకమై భవిష్యత్తు ఉద్యమాలకు గిరిజనులు సిద్ధం అవ్వడం ఖాయమని హెచ్చరికలు జారీ చేశారు.

2,913 Views

You may also like

Leave a Comment