Home ఆంధ్రప్రదేశ్ మంచాలమ్మ దేవస్థానంలో వైభవంగా వరలక్ష్మీ వ్రత మహోత్సవం

మంచాలమ్మ దేవస్థానంలో వైభవంగా వరలక్ష్మీ వ్రత మహోత్సవం

by VRM Media
0 comments

అన్నమయ్య జిల్లాVRM న్యూస్ ఆగస్టు 10

అన్నమయ్య జిల్లా రాయచోటి నారాయణరెడ్డి పల్లెలో వెలసిన అమ్మలగన్నమ్మ ఆదిపరాశక్తి శ్రీ మంచాలమ్మ దేవస్థానంలో వరలక్ష్మీ వ్రతం అతి వైభవంగా జరిగింది ఆలయ ప్రధాన అర్చకులు మహేష్ స్వామి అజయ్ స్వామి సునీల్ స్వామి ఉదయం అమ్మవారికి నవ కలశాభిషేకం నిర్వహించారు అమ్మవారి అలంకరణ పూర్తయిన తర్వాత ఉదయం 11 గంటలకి వరలక్ష్మి వ్రతo ప్రారంభించడం జరిగింది వరలక్ష్మి వ్రత మహత్యం కథ భక్తాదులకు ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు ఎంతో సరళంగా ప్రధాన అర్చకులు భక్తాదులకు వరలక్ష్మీ వ్రత విధానాన్ని తెలియజేయడం జరిగింది తదనంతరం అమ్మవారిని భక్తులందరూ దర్శించుకుని తీర్థ ప్రసాద వినియోగం పూర్తి కాగానే శానంపల్లి వెంకటరెడ్డి విజయమ్మ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని భక్తాదులకు ఏర్పాటు చేశారు ఆలయ వ్యవస్థాపకులు జి.రామాంజలమ్మ రమణయ్య దంపతులు అన్న దాతల ను సత్కరించారు తదనంతరం అమ్మవారికి పూలదాత అయినటువంటి రామ్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను ఆలయ వ్యవస్థాపకులు సత్కరించడం జరిగింది. దాదాపు వందలాదిమంది భక్తాదులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు

2,811 Views

You may also like

Leave a Comment