
గిరిజన విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం తగదు
పిల్లల తల్లిదండ్రుల
ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కి వినతి
కల్లూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ను సత్తుపల్లి కి తరలింపు విరమించుకోకపోతే ఆందోళన తప్పదని హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కు వినతి పత్రం అందజేశారు
కల్లూరు డివిజన్ కేంద్రంలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో సుమారుగా వందమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు విద్యా సంవత్సరం ప్రారంభమైన అప్పటి నుంచి ఆశ్రమ పాఠశాలలో తరచుగా ఇప్పటికి మూడుసార్లు ఫుడ్ పాయిజన్ అవడం బాధాకరమన్నారు విద్యార్థుల పట్ల ఆశ్రమం పాఠశాల వార్డెన్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ డిడి పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి ఘటనలు మరలా పునరావతం అవకుండా చూడాలని
ఐటీడీఓ పిఓ ఐదు రోజుల క్రితం ఆశ్రమం పాఠశాలను సందర్శించి ఆశ్రమ పాఠశాల మరమ్మత్తుల కోసం సుమారుగా పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్న అని చెప్పి ఇప్పుడు రెండు రోజులు క్రితం ఖమ్మం జిల్లా గిరిజన డిప్యూటీ డైరెక్టర్ కల్లూరు ఆశ్రమ పాఠశాలను సత్తుపల్లికి తరలించాలని ఆదేశాలు ఇచ్చారు
కల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గల కారణాలను సమీక్షించకుండా కల్లూరు డివిజన్ కేంద్రంలోని గిరిజన ఆశ్రం పాఠశాలను సత్తుపల్లి కి తరలించడంలో ఆంతర్యం ఏమిటని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నించారు కల్లూరు లోనే గిరిజన ఆశ్రమ పాఠశాలను కొనసాగించాలని ఆయన అన్నారు సత్తుపల్లికి తరలించాలని ఆలోచనలను విరమించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు.