
సిద్ధవటం, VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 26
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి మండలంలోని మాధవరం -1 గ్రామంలోని ముస్లిం మైనారిటీ నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ వీరభద్రుడు స్వగృహంలో మంగళవారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి , వివాహ వేడుకలు సందర్భంగా మండల టిడిపి అధ్యక్షులు మోహన్ రెడ్డి అధ్యక్షతన భారీగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా టిడిపి అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ కు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు మాజీ మార్కెట్ చైర్మన్ సయ్యద్ జవహర్ భాష మాట్లాడుతూ కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు మోహన్ రెడ్డి, నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు డాక్టర్ వీరభద్రుడు మాజీ మార్కెట్ చైర్మన్ సయ్యద్ జవహర్ భాష, హరి, వినోద్, బత్తెన వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు