

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు26
రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానంతో డొక్కా సీతమ్మ నామకరణంతో విద్యార్థులకు ప్రభుత్వ, పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ జగన్మోహన్ రాజు ఆదేశాలతో మంగళవారం సిద్దవటం టిడిపి మండల అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి అధ్యక్షతన మండలంలోని వెంకటేశ్వరపురం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మంగళవారం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంగళవారం మండల టిడిపి అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం కడుపునిండా తింటున్నారని గత ప్రభుత్వంలో విద్యార్థులకు పొందిస్తున్న బియ్యం నాణ్యతలోపం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందిపడే వారిని కూటమి ప్రభుత్వంలో మెరుగైన సన్న బియ్యం అందించడంతో వంట ఏజెన్సీ వారికి కూడా ఇబ్బందులు లేకుండా రుచికరమైన భోజనం అందిస్తున్నారని రాష్ట్ర ప్రజలకు చెప్పిన వాగ్దానాల ప్రకారం ప్రతి ఒక్కటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలుచేసి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారని విద్యార్థులు కడుపునిండా అన్నం తినడంతో వారి తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ సయ్యద్ జవహర్ భాష రాజంపేట నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు డాక్టర్ వీరభద్రుడు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు