
ఒంటిమిట్టలో అభివృద్ధి బాట – జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ముందడుగు
ఒంటిమిట్ట ,సెప్టెంబర్ 8: ఒంటిమిట్ట మండలం అభివృద్ధి పంథాలో మరో అడుగు ముందుకు వేసింది. మొత్తం ఐదు కోట్ల 14 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సహకారంతో ఈ నిధులు సమకూరాయి. గంగపేరూరు పంచాయతీ పరిధిలోని చిన్నకొత్తపల్లి గ్రామంలో రోడ్ల పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండలశాఖ అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బొబ్బిలి రాయుడు, చెరువు చైర్మన్ కట్ట వెంకటరమణ, కే. సుబ్బరాయుడు, వి. వెంకటేశు, టీ. మధుసూదన్, బి. శ్రీనివాసులు, స్కూల్ చైర్మన్ రాజేష్, ఎన్. వెంకటసుబ్బయ్య, మల్లికార్జున, ఎస్. విశ్వనాథ్ తో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు. మామిడి శశికళ, కొత్తపల్లి మహాలక్ష్మి లు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించగా, గ్రామంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది.
గ్రామ ప్రజలు మాట్లాడుతూ – “ఎన్నాళ్లుగా రోడ్ల కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు మా ఊరికి సిసి రోడ్లు రావడం పండగలాంటిదే. ఇది జగన్మోహన్ రాజు గారి కృషి వల్లే సాధ్యమైంది. ఆయన ఆధ్వర్యంలో ఒంటిమిట్ట మండలంలో మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతాయనే నమ్మకం మాకు ఉంది” అన్నారు.
జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఒంటిమిట్ట మండల అభివృద్ధి దిశగా వేగవంతంగా అడుగులు వేస్తోంది. సిసి రోడ్లతో పాటు తాగునీటి సదుపాయాలు, విద్యుత్, గ్రామీణ మౌలిక వసతుల కల్పనలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పార్టీ శ్రేణులు వెల్లడించారు. అభివృద్ధి అంటే మాటలకే పరిమితం కాకుండా, ఆచరణలో చూపించగలిగేది తెలుగుదేశం నాయకత్వమని ఈ పనులు మరోసారి రుజువు చేస్తున్నాయి.
“తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి భరోసా ఉంటుంది. రాజంపేట నియోజకవర్గానికి, ఒంటిమిట్ట మండలానికి జగన్మోహన్ రాజు వంటి నాయకుడు ఉండటం ప్రజలకు అదృష్టం” అని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.