
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 3
అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట ను సాధించుకోవడం తప్ప మరో మార్గం లేదని రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ తెలిపారు మండలంలోని మాధవరం గ్రామంలోని బంగారు పేట వద్ద బుధవారం ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రం అనువైన ప్రాంతమని అన్నమయ్య నడియాడిన రాజంపేట జిల్లా కేంద్రంగా అన్ని అర్హతలు ఉన్నాయని గడచిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వాగ్దానం చేశారని ఆ వాగ్దానం అమలు చేయాలని జనసేన పార్టీ తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో శాంతియుత ర్యాలీకి రాజంపేట జిల్లా సాధన కొరకు బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేస్తామన్నారు గత వైసిపి పాలనలో పాలకుల నిర్లక్ష్యం వల్ల రాజంపేటకు తీరని అన్యాయం చేశారని అన్నమయ్య నడి యాడిన గడ్డ రాజంపేట అడ్డా అంటూ అటువంటి అనువైన ప్రదేశాన్ని సర్వనాశనం చేశారని వైసిపి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు ప్రాంతాలవారీగా విభజించు, పాలించు అంటూ రాష్ట్ర రాజధాని 3 రాజధానులు అంటూ ప్రాంతాలవారీగా ప్రజలను రెచ్చగొట్టి ఏపీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికి దక్కుతుందని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని అభివృద్ధివైపు పరుగులు పెడుతుందని రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతన్నలపై తప్పుడు కేసులు బదలాయించి రైతు కుటుంబాలను సర్వ నాశనం చేసిన ఘనత అప్పటి వైసిపి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రాంతాలవారీగా చిచ్చు పెట్టకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి, నేతలు పాల్గొన్నారు