Home Uncategorized కన్నవారి కన్నీరు తుడిచిన ‘ఖాకీ’ కవచంఅభినందించిన ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్

కన్నవారి కన్నీరు తుడిచిన ‘ఖాకీ’ కవచంఅభినందించిన ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్

by VRM Media
0 comments

అన్నమయ్య జిల్లా రిపోర్టర్ రెడ్డి శేఖర్ బాబు

అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మహబూబ్ బాషా వీధిలో సందడి నెలకొంది. కానీ, బి. నాగార్జున ఇంట్లో మాత్రం ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. 4 ఏళ్ల చిన్నారి శ్రీహాన్ ఆడుకుంటూ కనిపింకుండా పోయాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కళ్లముందు లేకపోవడంతో ఆ తల్లిదండ్రుల గుండె ఆగినంత పనైంది. వీధి వీధి గాలించారు పిలిచారు కానీ ఫలితం లేదు. దిక్కుతోచని స్థితిలో వారు పరుగెత్తుకుంటూ రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కారు తల్లిదండ్రుల కళ్ళలో భయాన్ని చూసిన సీఐ బీవీ చలపతి, ఎస్ ఐ జాహిర్ క్షణం కూడా వృధా చేయకుండా వెంటనే శ్రీహాన్’ మిషన్ ప్రారంభించరు కానిస్టేబుళ్లు పవన్ కుమార్ దామోదర్ లతో ఒక టీమ్ ఏర్పాటు చేశారు. “బిడ్డ ఎక్కడికి పోడు మేమున్నాం” అని ధైర్యం చెప్పి గాలింపు మొదలుపెట్టారు ఒకవైపు టెక్నాలజీ (సీసీ కెమెరాలు), మరోవైపు క్షేత్రస్థాయి నెట్‌వర్క్.. పోలీసు యంత్రాంగం ఉరుకులు పెట్టింది. సరిగ్గా అదే సమయంలో, ఏడుస్తూ రోడ్డుపై వెళ్తున్న పిల్లాడిని గమనించిన ఒక మటన్ వ్యాపారి, బాబును మసీదుకు చేర్చారు మసీదు మైకుల నుండి బాబు ఆచూకీ గురించి అనౌన్స్‌మెంట్ వస్తున్న తరుణంలోనే, నిరంతరం అప్రమత్తంగా ఉన్న పోలీసు బృందం అక్కడికి చెరుకొని ఫిర్యాదు అందిన కేవలం 10 నిమిషాల్లోనే పిల్లాడిని క్షేమంగా భుజాన ఎత్తుకున్నారు స్టేషన్లో ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల వద్దకు పోలీసులు బాబును తీసుకురాగానే, ఆ తండ్రి తన బిడ్డను హత్తుకుని ఏడ్చిన తీరు అక్కడున్న వారిని కదిలించింది. 10 నిమిషాల క్రితం ఉన్న భయం, ఇప్పుడు అనంతమైన కృతజ్ఞతగా మారింది ఈ వేగవంతమైన రెస్క్యూ ఆపరేషన్ గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు పోలీసు బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. “సమయస్ఫూర్తి, బాధ్యత కలిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన అధికారులకు నా అభినందనలు” అని ఆయన కొనియాడారు పోలీసు అంటే కేవలం లాఠీ మాత్రమే కాదు.. ఆపదలో అండగా నిలిచే భరోసా అని రాయచోటి పోలీసులు మరోసారి నిరూపించారు అన్ని ప్రజలు తెలిపారు

2,806 Views

You may also like

Leave a Comment