తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో సంక్రాంతి సందర్భంగా ఈనెల 7, 8, 9 వ తేదీల్లో నిర్వహిస్తున్న ఉద్భావ్ 2026 టాలెంట్ హంట్ ఫెస్టివల్ ప్రోగ్రాంకు
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు భారీ ఆర్ధిక సహాయం రెండు లక్షల 25,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు.
ఆర్ట్స్ కళాశాలకు చెందిన స్టూడెంట్స్ అభినయశ్రీ, సాయి శ్రీ, షర్మిల సుహాసిని, వడ్డీ నాగ చైతన్యలు కంబాల శ్రీనివాసరావు వద్దకు వచ్చి కళాశాలలో ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని,
సుమారు పది లక్షలు రూపాయల వరకు ఖర్చవుతుందన్నారు. ఏడు లక్ష రూపాయలు విరాళాలు అందాయని, మరో మూడు లక్షల రూపాయలు అవసరం ఉందని, సహకారం అందించాలని కోరారు.
స్పందించిన కంబాల శ్రీనివాసరావు గారు యువతను ప్రోత్సహించాలనే సంకల్పంతో రెండు లక్షల 25,000 రూపాయలు విరాళం అందించారు.