సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ జనవరి 8
మినీ గోకుల షెడ్డు నిర్మాణాలు రైతులకు ఎంతో లాభసాటిగా ఉంటుందని రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు మండలంలోని ఎస్ రాజంపేట గ్రామం లో గురువారం ఆయన పార్ల గంగమ్మ అనే మహిళ రైతు కు మంజూరైన మినీ గోకులం షెడ్డు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పథకం ద్వారా రైతులకు అర్హులైన రైతులకు మినీ గోకులాలు మంజూరు అయ్యాయని 2 లక్షల రూ, నిధులతో పాడి పశువుల పాగా కోసం మినీ గోకుల నిర్మాణ భూమి పూజ నిర్వహించామని రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ప్రతి రైతు మినీ గోకులాల నిర్మాణ పనులు చేపట్టాలని రైతులకు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ ఆకుల తిరుమల బాబు ఏపీవో నరసింహులు, మాజీ సర్పంచ్ సంజీవ రాయుడు, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య, టిడిపి మండల అధ్యక్షులు రాజశేఖర్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు చెంచయ్య నాయుడు, మాజీ జెడ్పిటిసి చలమయ్య, పార్లమెంటు ఉపాధ్యక్షులు నాగ ముని రెడ్డి పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు పార్ల ప్రసాద్, సిద్ధవటం గ్రామ సర్పంచ్ ప్రతినిధి ఓబులయ్య, పార్ల శ్రీనివాసులు, బూసి కృష్ణారెడ్డి, జ్యోతి వెంకటసుబ్బారెడ్డి తదితర మండల టిడిపి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

