

సూపర్ స్టార్ మహేష్ బాబు (మహేష్ బాబు), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS రాజమౌళి) కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘వారణాసి’ (వారణాసి). ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అంటార్కిటికాలోని గడ్డకట్టే మంచు లొకేషన్లలో శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ భారీ షెడ్యూల్ ముగిసిన వెంటనే చిత్ర యూనిట్ ఒక లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ బ్రేక్ వెనుక జక్కన్న ఒక భారీ స్ట్రాటజీని సిద్ధం చేశారనే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రియలిస్టిక్ విజువల్స్ కోసం రాజమౌళి ఎక్కడా రాజీ పడకుండా ఎక్స్‌ట్రీమ్ లొకేషన్‌లను ఎంచుకున్నారు. అంటార్కిటికాలో జరుగుతున్న ఈ షెడ్యూల్ సినిమాలోనే అత్యంత కీలకమైనది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక టీమ్ లాంగ్ బ్రేక్ తీసుకో టాక్. ఈ గ్యాప్‌లో పోస్ట్-ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించనుంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పనులు క్వాలిటీగా రావడం కోసమే రాజమౌళి ఈ లాంగ్ బ్రేక్ ప్లాన్ చూపిస్తున్నారు. అలాగే గ్లోబల్ మార్కెట్ స్ట్రాటజీపై ఫోకస్ పెట్టనున్నారని సమాచారం.
మరోవైపు, ‘వారణాసి’ మూవీ ఏప్రిల్ 24న మెక్సికోలో జరగనున్న ‘CCXP మెక్సికో 2026’ ఈవెంట్‌లో గ్లోబల్ డెబ్యూ జరగనుంది. ఈ వేడుకలో సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ బీహైండ్-ది-సీన్స్ దృశ్యాలను, గ్లింప్స్‌ను ప్రదర్శిస్తారు.
హాలీవుడ్ చిత్రాల తరహాలో షూటింగ్ జరుగుతున్నప్పుడే గ్లోబల్ మార్కెట్ స్ట్రాటజీని అమలు చేయడం రాజమౌళికి అలవాటు. ‘వారణాసి’ సినిమాకి అంతర్జాతీయ నిర్మాణ సంస్థల సహకారంతో, ప్రమోషన్లు అదే రేంజ్‌లో ఉండబోతున్నాయి.
ఈ లాంగ్ బ్రేక్ సమయంలోనే సినిమా బిజినెస్, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ డీల్స్ క్లోజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి, మహేష్ బాబును గ్లోబల్ ఐకాన్‌గా మార్చేందుకు రాజమౌళి పక్కా స్కెచ్‌తో ముందుకు వెళ్తున్నారు.