Home Uncategorized వైరా రిజర్వాయర్లో పడి వ్యక్తి మృతి

వైరా రిజర్వాయర్లో పడి వ్యక్తి మృతి

by VRM Media
0 comments

VRM మీడియా ఖమ్మం ప్రతినిధి రాంబాబు

కొణిజర్ల : వైరా రిజర్వాయర్ లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది, కొణిజర్ల ఎస్ఐ గుగులోతు సూరజ్ కథనం ప్రకారం, వైరా మున్సిపాలిటీ లోని లీల సుందరయ్య నగరకు చెందిన లారీ డ్రైవర్ ఆది శివప్రసాద్(48) గురువారం రాత్రి భోజనం అనంతరం వాకింగ్ కోసం రిజర్వాయర్ వద్దకు వెళ్లాడు, ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడినట్లు తెలుస్తోంది, ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు, శుక్రవారం ఉదయం శివప్రసాద్ మృతదేహం చెరువులో తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు, ఆయనకు భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు, మృతుడి తండ్రి జగన్నాథం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పంచనామా కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

2,821 Views

You may also like

Leave a Comment