Home Uncategorized బాధితులు ధైర్యంగా ఉండాలి,, ప్రభుత్వం తరఫున పూర్తి న్యాయం చేస్తాం….

బాధితులు ధైర్యంగా ఉండాలి,, ప్రభుత్వం తరఫున పూర్తి న్యాయం చేస్తాం….

by VRM Media
0 comments

ఆటోనగర్ టు మద్దులపల్లి రోడ్డు బాధితులకు కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి భరోసా..

ఖమ్మం రూరల్ విర్ఎం మీడియా కార్తిక్.మే 22

మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో తప్పకుండా న్యాయం చేస్తామని మున్సిపల్ కమీషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి రోడ్డు నిర్మాణంలో ఇండ్లు నష్టపోతున్న బాధితులకు భరోసా కల్పించారు.
శుక్రవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులోని ఆటోనగర్ నుండి మద్దులపల్లి రోడ్డు ఏర్పాటు పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆటోనగర్ కాలనీలో రోడ్డు విస్తరణ కారణంగా ఇండ్లు కోల్పోతున్న బాధితులు తమకు న్యాయం చేయాలని కమిషనర్‌ను వేడుకున్నారు.
కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు రోడ్డు నిర్మాణానికి సహకరించాలని, బాధితులకు తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆటోనగర్ ప్రారంభం నుంచి ఇండ్ల వరకు 40 అడుగులు రోడ్డు నిర్మితమయ్యేలా మంత్రి దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. ఇలా చేయడం వలన ప్రహరీ గోడలు తొలగించే అవకాశం ఉన్నందున స్థానికులు సహకరించాల్సిందిగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ జిల్లా , మండల అధికారులు పాల్గొన్నారు.

2,804 Views

You may also like

Leave a Comment