ఎదులాపురం మునిసిపాలిటీ ఖమ్మం వి ఆర్ ఎం మీడియా| కార్తిక్.మే 24
13వ డివిజన్ పరిధిలోనీ ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 లో గతకొన్ని రోజులుగా నీటి సమస్య తలెత్తడం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలిసిన కార్పొరేటర్ బైరు కోటేశ్వరరావు గతంలో సర్పంచ్ గా ఉన్న ప్రస్తుత మధులపల్లి మార్కెట్ చెర్మెన్ బైరు హరినాథ్ బాబు నిర్మించిన వాటర్ సంపును అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ సంపుకు మోటర్ బిగించి పైపులు అమర్చుతున్నారు.మరి కొన్ని రోజుల్లో నీటి సమస్యకు పరిష్కారం జరుగుతుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బైరు కోటేశ్వరరావు గోగుల శ్రీను సత్యనారాయణ , శ్రీను sk యాసిన్ sk మౌలాలి కిరణ్ అనుముల కార్తీక్ పాల్గొన్నారు.