
భారతదేశం
ఓయ్-సయ్యద్ అహ్మద్
తమిళనాడులో రైతులకు సీఎం విజయ్ (CM Vijay) గుడ్ న్యూస్ చెప్పారు. రైతులు గతంలో తీసుకున్న రుణాలను మాఫీ నిర్ణయించారు. అయితే ఈ రుణాలు ఎవరెవరికి, ఎంత మేరకు అన్న విషయాలను తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం ఇవాళ ఎక్స్ లో ట్వీట్ చేసింది. దీంతో తమిళనాడులో గత ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని విజయ్ నిలబెట్టుకున్నట్లు అయింది.
తమిళనాడు సీఎం విజయ్.. చిన్న రైతుల కోసం సహకార బ్యాంకుల ద్వారా తీసుకున్న రూ.50,000/- వరకు పంట రుణాలను పూర్తిగా మాఫీ ప్రకటించారు. పంట రుణమాఫీ పథకం కింద మే 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 మధ్య సహకార బ్యాంకుల నుండి పంట రుణాలు తీసుకున్న 14.22 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు. ఈ పథకం వల్ల తమిళనాడు ప్రభుత్వానికి ₹2,044 కోట్ల అదనపు వ్యయం అవుతుంది. రాబోయే సాగు సీజన్ కోసం కొత్త రుణాలు కోరుకునే రైతులకు ఈ పంట రుణమాఫీ వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో అందిస్తుంది.

చిన్న రైతులతో పాటు పెద్ద రైతులకు సైతం తమిళనాడు ప్రభుత్వం ఓ చిన్న ఊరటనిచ్చింది. పెద్ద రైతుల పంట రుణ చెల్లింపు కోసం రూ.5,000 మాఫీ ప్రభుత్వం అందించింది. అయితే ఈ రుణమాఫీ వెంటనే జరుగుతుందా లేక ఎప్పుడు చేస్తారన్న దానిపై ప్రభుత్వం త్వరలో వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చూపుతున్నారు. ఏదైమైనా విజయ్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ ఒక్కొక్కటిగా నిలబెట్టుకోవడంపై ప్రజల్లో సానుకూల స్పందన వస్తోంది.