
భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వాణిజ్య రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పశ్చిమాసియా యుద్ధ సెగలు ప్రపంచ దేశాలతోపాటు భారత్ కూ చేరాయి. ఈ భారత్ లోనూ వారం రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. అటు ఎల్పీజీ గ్యాస్ బుకింగ్, డెలివరీలోనూ పలు కీలక మార్పులు వచ్చాయి.
అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సరఫరాలో కీలక మార్పులు చేసింది. గృహ వస్తువుల కోసం ఎల్పీజీ నిబంధనలను సవరించింది. PNG కనెక్షన్ తీసుకునే ఎల్‌పీజీ గృహ వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. పీఎన్‌జీ కనెక్షన్ వచ్చిన 30 రోజుల్లో ఎల్‌పీజీని రద్దు చేసుకోవచ్చు లేదా భవిష్యత్తు కోసం ట్రాన్స్‌ఫర్ వోచర్ పొందే విధంగా కొత్త రూల్ అందుబాటులోకి వచ్చింది. బదిలీ అయ్యే ఉద్యోగులు, వలస కుటుంబాలు, విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొత్త ఉత్తర్వుల ప్రకారం.. పైప్ లైన్ గ్యాస్ కనెక్షన్ ఉన్న ఏ కుటుంబం అయినా తమ వద్ద ఉన్న డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ కనెక్షన్‌ను ఉంచుకోకూడదు. ఒకే అడ్రస్ లో ఎల్పీజీ సిలిండర్, పీఎన్జీ పైప్ లైన్.. ఈ రెండు కలిపి ఉండటాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ప్రభుత్వ చమురు సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లు పీఎన్జీ వాడుతున్న వినియోగదారులకు కొత్త ఎల్పీజీ కనెక్షన్లు రీ ఇవ్వడం లేదా సిలిండర్లను ఫిల్ చేయడం చేయరాదని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇక వినియోగదారులు మీ ప్రాంతంలో పీఎన్జీ పైప్ లైన్ నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చి గ్యాస్ కంపెనీల తర్వాత మీకు నోటీసు లేదా కమ్యూనికేషన్ పంపిన 3 నెలల లోపు మీరు పీఎన్జీ కనెక్షన్ కు మారాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా పీఎన్జీ కనెక్షన్ తీసుకోకపోతే ఆ ఇంటికి సరఫరా అవుతున్న ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్ ను ఆటోమెటిక్ గా నిలిపివేస్తారు. ఇక నిబంధన కేవలం సొంత ఇల్లు ఉన్నవారికే కాదు.. అద్దె ఇంట్లో ఉంటున్న కొత్త టెనెంట్స్ కూడా వర్తిస్తుంది. వారు కూడా తమ పరిధిలోని పీఎన్జీ కనెక్షన్ ను వాడుకోవాల్సి ఉంటుంది. వారి ఎల్ పీజీ సిలిండర్లను తక్షణమే సరెండర్ చేయవలసి ఉంటుంది.