Vrm media ఖమ్మం ప్రతినిధి రాంబాబు

*ఖమ్మం:స్థానిక వీవీసీ (VVC) స్కూల్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శారద ఎడ్యుకేషనల్ విద్యాసంస్థల చైర్మన్, వీవీసీ స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్
రేఖల భాస్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 1250 మంది విద్యార్థులు అమరవీరుల త్యాగాల ఫలమే నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమని కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యార్థులకు విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు.
*ఐకమత్యమే మహాబలం* ఏదైనా ఒక జాతి లేదా సమూహం తమ అస్తిత్వం కోసం పోరాడేటప్పుడు ఐకమత్యాన్ని మించిన బలం మరొకటి లేదు” అని ఆయన విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.
భవిష్యత్తు పౌరులునేటి బాలలే రేపటి పౌరులు’ అని గుర్తు చేస్తూ, విద్యార్థులందరూ కష్టపడి చదువుకుని దేశానికి, తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ వేడుకల్లో భాగంగా ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో శారద విద్యాసంస్థల డైరెక్టర్, వీవీసీ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు,విద్యులత ,
వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.