*ఖమ్మం ప్రతినిధి చిన్నంశెట్టి రాంబాబు
-తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు గా ఎన్నికైన గొడుగునూరి లక్ష్మారెడ్డి గారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి దయానంద్.
రాగమయిదయానంద్ మాట్లాడుతూ తల్లాడ మండలం లో కాంగ్రెస్ పార్టీ ని మరింత బలోపేతం చేయాలని రానున్న రోజుల్లో ఎంపీటీసీ.జెడ్పిటిసి. ఎన్నికలలో మండలంలో ఉన్న నాయకులను మరియు కార్యకర్తలను అనుసంధానం చేస్తూ, ఒకేతాటిపై నడిపిస్తూ, ప్రతిఒక్కరిని సమాన్వయం చేసుకుంటు పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని తగు సూచనలు చేశారు.
గొడుగునూరి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తల్లాడ మండల అధ్యక్షులుగా నియమించిన సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి కి మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు దయానంద్ గారికి,కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అలాగే తనపై ఎంతో విశ్వాసంతో మండల అధ్యక్షుడిగా నియమించినందుకు, ఇందుకు సహకరించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు అన్ని విధాల ఎల్లవేళలా అందుబాటులో ఉంటు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిచెవిదంగా కృషి చేస్తానని అదేవిధంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మండలంలో మరింత బలోపేతం చేస్తానని అన్నారు. కార్యక్రమంలో దగ్గుల రఘుపతి రెడ్డి, గోవింద్ శ్రీను,దుండేటి వీరారెడ్డి, జక్కంపూడి కిషోర్, సామినేని రామప్ప రావు, గణేషుల రవి, పొట్టేటి జనార్దన్ రెడ్డి, మూకర ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, మొక్క బసవయ్య,కోటిరెడ్డి,భూక్యా కాళోజీ, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపా సర్పంచ్ లు,వార్డ్ మెంబర్లు,యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
