మృతిని కుటుంబానికి 10 వేలు ఆర్థిక సహాయం
మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రతినిధి డేరంగుల శ్రీకాంత్
సిద్ధవటం,VRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూన్ 5
మండలంలోని, మాధవరం, 1 రామకృష్ణాపురం గ్రామంలో నివాసమున్న మోహన్ కృష్ణ(35) అనారోగ్యాల వల్ల కడప రిమ్స్ వైద్యశాలలో చికిత్స తీసుకుంటూ గురువారం రాత్రి మృతి చెందాడు ఈ సందర్భంగా సిద్ధవటం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రతినిధి డేరంగుల శ్రీకాంత్ శుక్రవారం మాట్లాడుతూ రామకృష్ణాపురంలో నివాసం ఉన్న మోహన్ వృత్తినిత్య బేల్దారి పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడని గత ఐదు నెలల బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతూ ఉండే వాడని మృతునికి ముగ్గురు పిల్లలు ఒక భార్య ఉన్నారని వైద్య చికిత్స సేవలు తీసుకుంటూ మృతి చెందాడని విషయం తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ 10 వేలు ఆర్థిక సహాయం అందించాడని నిరుపేదల కుటుంబాలకు అండగా ఆయన చేస్తున్న సహాయ కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు మృతుని కుటుంబీకులు రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అతి కారి కృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం యువజన విభాగం కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

