VRM మీడియా అయినవిల్లి భద్రం
వృక్షో రక్షిత రక్షితః ప్రకృతిని మనం రక్షిస్తే మనల్ని ప్రకృతి రక్షిస్తుంది
దివాన్ చెరువు పుష్కర వనంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
మొక్కలు నాటిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ .. మర్రిచెట్టు, మారేడు మొక్కలకు సేంద్రీయ ఎరువు కలిపి, నీళ్ళు పోసి స్వయంగా అటవీ అధికారులతో మొక్కలు నాటిన ఎమ్మెల్యే బత్తుల
ప్రకృతిని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమేనని, భావితరాలకు మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి పచ్చని పర్యావరణమేనని రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దివాన్చెరువు పుష్కర వనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులతో కలిసి ఆయన వనంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ “ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కేవలం ఒక రోజు జరుపుకునే పండుగ కాదు. ఇది మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న మితిమీరిన వేడి, అకాల వర్షాలు, వాతావరణ మార్పులన్నింటికీ కారణం ప్రకృతి సమతుల్యత దెబ్బతినడమే. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నేటి సమాజంలో పచ్చదనాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దివాన్ చెరువు పుష్కర వనం మన ప్రాంతానికి ఒక ఆక్సిజన్ హబ్ లాంటిది. ఇలాంటి చోట మొక్కలు నాటడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. నేను నియోజకవర్గ ప్రజలందరినీ, ముఖ్యంగా యువతను ఒకటే కోరుతున్నాను..ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఐదు మొక్కలు నాటాలి. వాటిని నాటడమే కాదు, అవి వృక్షాలు అయ్యేంత వరకు బాధ్యతగా కాపాడాలి. మన ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపొందించడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. నియోజకవర్గంలో పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు, అడవుల శాతాన్ని పెంచేందుకు అటవీ శాఖతో కలిసి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తాం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ప్రకృతిని మనం ప్రేమిస్తే, ఆ ప్రకృతి మనల్ని, మన పిల్లల్ని చల్లగా కాపాడుతుంది. అలానే కొంతమంది ఏ మొక్కలు నాటుతున్నారో అవగాహన లేకుండా మొక్కలు పెంచడం కంటే మన దేశీయ వృక్ష జాతులైన వేప, రావి, మర్రి, చింత, సీమ చింత, గానుగ, తురాయి లాంటి చెట్లను పెంచడం ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ పొందడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ఈ మొక్కలు నాటే ఉద్యమాన్ని త్వరలో నియోజకవర్గవ్యాప్తంగా ప్రతీ గ్రామంలో వెయ్యి నుండి 1500 వరకు మొక్కలు నాటే కార్యక్రమం వాటిని సంరక్షించే కార్యక్రమం చేపట్టబోతున్నామని అన్నారు. రండి, అందరం కలిసి మన రాజానగరం నియోజకవర్గాన్ని పచ్చని సుందర వనంగా మార్చుకుందాం.” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, పర్యావరణ ప్రేమికులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
