[ad_1]
తెలంగాణ
ఓయ్-చంద్రశేఖర్ రావు
తెలంగాణలో వేకువజామున భూకంపం సంభవించింది. ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. దీనివల్ల ప్రాణం, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు వార్తలు అందలేదు. దీని ధాటికి స్థానికులు ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా ప్రకంపనలు సంభవించడంతో ఇళ్లల్లోకి వెళ్లేందుకు భయపడ్డారు. చాలాసేపటివరకు ఆరుబయటే గడిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వేకువజామున 2:26 నిమిషాలకు ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కెల్ పై దీని తీవ్రత 3.8గా నిర్ధారించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలాజీ. 17.492° ఉత్తర అక్షాంశం, 80.894° తూర్పు రేఖాంశం వద్ద గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గర్తించింది. భద్రాచలానికి నైరుతి దిశగా 20 దూరంలో ఉంటుందీ ప్రాంతం. మొత్తం నుంచి సుమారు 10 అడుగుల లోతున టెక్టానిక్ ప్లేట్స్ లల్లో చోటు చేసుకున్న భారీ కదలికల నేపథ్యంలో భూమి ప్రకోపించింది.

మొదట భూకంప తీవ్రతను 3.5గా అంచనా వేసిన, తర్వాత దాన్ని 3.8గా సవరించారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా సుమారు 25 నిమిషాల పాటు ప్రకంపనలు సంభవించాయి. మోడిఫైడ్ మెర్కల్లి ఇంటెన్సిటీ స్కెల్ ప్రకారం భూకంప కేంద్రం పరిసర ప్రాంతాలు జోన్ 4 పరిధిలోకి వస్తుంది.
భూకంప కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో పాల్వంచలో తేలికపాటి ప్రకంపనలు రికార్డయ్యాయి. భద్రాచలం- 20, సారపాక- 22, సత్తుపల్లి- 27, కొత్తగూడెం- 30 ప్రాంతంలో ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో స్వల్పంగా భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రదర్శించారు.
ఈ భూకంపంతో సుమారు 3.2 x 1010 జౌల్స్ శక్తి విడుదలైనట్లు అంచనా. ఇది 8.78 మెగావాట్ అవర్స్ లేదా 7.56 టన్నుల టీఎన్టీకి సమానమని సిస్మిక్ లెక్కలు చెబుతున్నాయి. ఇంతకుముందు 2022 ఫిబ్రవరి 18న ఇదే ప్రాంతంలో భూమి కంపించింది. అప్పట్లో దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.3 రికార్డు అయింది.
[ad_2]