Home Uncategorized ఆదివాసి హక్కులు,చట్టాలు జోలికొస్తే ఉపేక్షించం.ఏపీ ఆదివాసీ జేఏసీ డిమాండ్.

ఆదివాసి హక్కులు,చట్టాలు జోలికొస్తే ఉపేక్షించం.ఏపీ ఆదివాసీ జేఏసీ డిమాండ్.

by VRM Media
0 comments

దేవీపట్నం,జూన్ 13.VRM మీడియా అయినవిల్లి భద్రం

ఆదివాసీ హక్కులు,చట్టాలు జోలికొస్తే ఉపేక్షించమని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ నాయకులు ఆలిండియా ఆదివాసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కంగల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీ పట్నం మండల పరిధిలోని దేవారం గ్రామంలో ఏపీ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివాసీ హక్కులు,చట్టాలపై అవగాహన కార్యక్రమానికి ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర అధ్యక్షత వహించారని,అలాగే జిల్లాస్థాయి సమావేశం ప్రారంభానికి మందు ఆదివాసి పోరాట యోధులకు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించమని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ తెలిపారు.ఈ సందర్భంగా ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ నాయకులు ఆల్ ఇండియా ఆదివాసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కంగల శ్రీనివాస్ మాట్లాడుతూ…ఆనాడు 1917 సంవత్సరంలో షెడ్యూల్డ్ ప్రాంతంలో భూమి నీరు అడవి జల్ జంగిల్ జమీన్ ఆదివాసులకే సొంతమని ఆదివాసీ పోరాట యోధులు పోరాడు సాధించిన 1917,1/59,1/70 భూమి చట్టాలు,పెసా చట్టం,అటవీ హక్కుల చట్టం మొదలైన హక్కులు చట్టాలను,జీఓ నెంబర్ 3 రద్దు చేసినట్లుగా ఆదివాసీ హక్కులు చట్టాలను రద్దు చేయాలని ఆదివాసేతరులు చూస్తే ఉపేక్షించమని ప్రభుత్వానికి హెచ్చరించారు.పెసా గ్రామసభ తీర్మానాలకు చట్టబద్ధత కల్పించాలని,చదువుకున్న ఆదివాసీ యువతీ యువకులకు 100 శాతం ఉద్యోగాలు ఇస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ అమలు చేయాలని.అలాగే(టి.ఏ.సి) ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ లో తక్షణమే తీర్మానం చేసి షెడ్యూల్టు ప్రాంత ఉద్యోగాల నియమకాల చట్టం ప్రకటించి తక్షణమే ఆదివాసి ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని,పోలవరం నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం శాస్త్రీయ సమగ్ర పునరావాసం కల్పించాలని,ప్రస్తుతం ఆర్ అండ్ ఆర్ కాలనీలు గంగంపాలెం,దండంగి,మూలపాడు,తోయ్యేరు గ్రామాలకు తక్షణమే మంచినీటి సమస్య పరిష్కరించాలని మరియు ఏజెన్సీ మారుమూల గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.అలాగే ఆదివాసీ పెద్దలు కోసు సోమన్న దొర శాలువ కప్పి ఘనంగా సన్మానించమన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరరావు,సోడే మురళి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి,సోడే కన్నం రాజు ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్,మడి మురళి ఆదివాసి నిరుద్యోగ ఉద్యోగ సాధన కమిటీ జిల్లా అధ్యక్షులు,మాజీ ఉద్యోగి కారం రంగారావు దొర,మడకం బంగారు బాబు ఆదివాసీ మహాసభ జిల్లా అధ్యక్షులు,డి కనకదుర్గ ఆల్ ఇండియా ఆదివాసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మహిళ జిల్లా అధ్యక్షురాలు,కొమరం జ్యోతి,పచ్చుకూరు అర్జునుడు,తుర్రం జగదీష్ దొర ఎంపీటీసీ శరభ వరం,దేవారం,కారం శ్రీనివాసరావు భారత్ ఆదివాసీ పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు,మడకం రామకృష్ణ దొర,పూసం రామన్న దొర మొదలైన వారు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

About Us

We're a media company. We promise to tell you what's new in the parts of modern life that matter. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo. Sed consequat, leo eget bibendum sodales, augue velit.

Facebook Twitter Youtube Linkedin Instagram

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs

Recent Articles

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs Daily horoscope: Your star sign reading, astrology and zodiac forecast Theory: Tom Holland’s Peter Parker replaced by Miles Morales in next trilogy

Featured

Latest box office bomb ‘will lose $100 million’ amid ongoing pandemic England vs South Africa free live stream: Watch Autumn Nations Series online White House plan aims to protect science from politics with new approach @2022 - All Right Reserved. Designed and Developed by PenciDesign