తేది;12-06-2026, శుక్రవారంVRM మీడియా అయినవిల్లి భద్రం
ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారమే లక్ష్యం
👉రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్,ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రాధాన్యత ప్రకారం పరిష్కార చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డ ఆమె క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యల రహిత సమాజం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తుందని పేర్కొన్నారు. అలాగే పలు మౌళిక సదుపాయాలు కల్పన కోసం వినతులు రాగా సంబధిత అధికారులకు తక్షణమే పరిష్కారం చేయాలని ఆదేశించారు. మరికొన్ని సమస్యల పరిష్కారం కోసం రాగా ప్రాధాన్యత ప్రకారం పరిష్కారం చేస్తానని హమీ ఇచ్చారు. విద్యుత్ సౌకర్యం లేదని లోతట్టుగ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేయగా త్వరగా విద్యుత్ సరఫరా కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాల్లో నెలకొన్న ప్రతీ సమస్యా పరిష్కారం చేసే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇటీవల కాలంలో అనారోగ్యం పాలైన కిలాడి నూకరాజుకి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందించారు.
కార్యక్రమంలో రాజవొమ్మంగి సొసైటీ అధ్యక్షులు ముప్పన కేశవ్, జనసేన మండల పార్టీ అధ్యక్షులు బొదిరెడ్డి త్రిమూర్తులు, తెదేపా నాయకులు వానపల్లి చిట్టిబాబు, గొర్లి సీతాంబరం, తేజ, బన్ను, ఊట చిన్నబాబు, రాజవొమ్మంగి మండల పరిషత్ అభివృద్ధి అధికారి లోకుల యాదగిరీశ్వరరావు పలు ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
