
ఖమ్మం,జూన్ 15 :
సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ విస్తరణలో భాగంగా ఖమ్మం జిల్లా కమిటీకి నూతన బాధ్యులను నియమించారు. సంస్థ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయం, రాష్ట్ర అధ్యక్షులు ఎలిగెండ్ల వెంకటేష్ సిఫార్సుల ఆధారంగా ఈ నియామకాలు చేపట్టినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి.
ఈ మేరకు కాసోజు శ్రీధర్‌ను సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా, నియమించారు.
కరుణాకర్ సుదగాని ని జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ, నియామక పత్రాలను జారీ చేశారు. ప్రజల్లో సమాచార హక్కు చట్టంపై మరింత అవగాహన కల్పించడం, ప్రజా సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన మార్గాల్లో పోరాటాలు నిర్వహించడం, సంస్థను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా, ఈ నియామకాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు సంస్థ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ, ప్రజల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో కృషి చేస్తారని, నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా సామాన్య ప్రజలకు న్యాయం అందించడంలో కమిటీ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజలకు అవసరమైన సమాచారం అందేలా చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే సంస్థ బలోపేతం కోసం రాష్ట్రవ్యాప్తంగా కమిటీల పునర్వ్యవస్థీకరణ కొనసాగుతోందని, అన్ని జిల్లాల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ, పారదర్శక పాలన సాధనకు సమాచార హక్కు చట్టం సమర్థవంతమైన ఆయుధమని, దాని పరిరక్షణకు కమిటీ నిరంతరం కృషి చేస్తుందని, వెల్లడించారు. ఈ సందర్భంగా జాతీయ వర్కింగ్ అధ్యక్షులు ఎటి ఆంజనేయులు చేతుల మీదుగా కాసోజు శ్రీధర్, కరుణాకర్ సుదగాని లకు నియామక పత్రాలను అందజేశారు.
నూతన బాధ్యులకు సంస్థ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో ఖమ్మం జిల్లాలో సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.