Home ఎంటర్‌టెయిన్మెంట్ ఈ రోజు మంచి రోజు కావడంతో సాయంత్రం రజినీ ప్రకటన.. మీరు ఊహించిందే – VRM MEDIA

ఈ రోజు మంచి రోజు కావడంతో సాయంత్రం రజినీ ప్రకటన.. మీరు ఊహించిందే – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


సూపర్ స్టార్ రజినీకాంత్(రజినీకాంత్)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఐదు దశాబ్దాల నుంచి రోజుకి పెరగడమే తప్ప తగ్గడం అనేది జరగని పని.. టైగర్ కా హుకుం అంటూ ‘జెన్ జి’ హీరోలకి సైతం పోటీ ఇస్తూ రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు.

ఈ కోవలోనే “ది టైగర్ ఈజ్ బ్యాక్ ఆన్ ది హంట్!” అంటూ జైలర్ 2(జైలర్ 2) తో రెడీ అవుతున్నాడు. టైగర్ మళ్లీ వేటకు సిద్ధమయ్యాడు అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో సన్ పిక్చర్స్ చేసిన అధికారిక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులన్నీ దాదాపు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రకటన రావడం విశేషం.

2023 ఆగస్టులో విడుదలైన మొదటి భాగం ‘జైలర్’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది ఏకంగా 650 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను తిరగరాసింది. ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజినీకాంత్ చూపించిన స్వాగ్, ఎలివేషన్ సీన్లు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. ఇప్పుడు వస్తున్న సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మొదటి భాగంలో ‘హుకుం’ పాట సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

ఇది కూడా చదవండి: Dulquer salmaan: దుల్కర్ మెడకి చుట్టుకున్న స్మగ్లింగ్ కేసు.. అభిమానుల ఆందోళన

ఈ క్రేజీ సీక్వెల్ కోసం సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ భారీ వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. కేవలం దర్శకుడు నెల్సన్ స్క్రిప్ట్ వర్క్ కోసమే 55 నుండి 60 కోట్ల భారీ అడ్వాన్స్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ రెండో భాగంలో సమకాలిన సామాజిక అంశాలతో పాటు మరింత హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు ఉండబోతున్నాయి. మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ ల గెస్ట్ అప్పీయరెన్స్ థియేటర్లని ఊపేసింది. ఇప్పుడు ఆతో పాటు ఎక్కువ మంది స్టార్స్ ఇద్దరికి అప్పీయరెన్స్ ఇవ్వనున్నారు.

2,803 Views

You may also like

Leave a Comment