Home ఎంటర్‌టెయిన్మెంట్ ఒక అజ్ఞాత మేధావి కథ.. బ్రిటీష్ వారిని వణికించిన జీడీ నాయుడు.! – VRM MEDIA

ఒక అజ్ఞాత మేధావి కథ.. బ్రిటీష్ వారిని వణికించిన జీడీ నాయుడు.! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


చరిత్ర ఎందరో వీరులను మనకు పరిచయం చేసింది. కానీ, దేశం కోసం, సాంకేతిక ప్రగతి కోసం అహర్నిశలు శ్రమించి కూడా కాలగర్భంలో కలిసిపోయిన అద్భుత మేధావులు కొందరు ఉంటారు. అలాంటి వారిలో కోయంబత్తూరులో జన్మించిన తెలుగు కుటుంబానికి చెందిన జీడీ నాయుడు (గోపాలస్వామి దొరస్వామి నాయుడు) అగ్రగణ్యుడు. ఆయన కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు.. భారతదేశపు ఎడిసన్‌గా కీర్తించబడిన గొప్ప ఆవిష్కర్త. బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక తిరుగులేని శక్తి ఆయన. ఆయన జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ‘జి.డి.ఎన్’ (GDN). తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సత్యరాజ్, జయరామ్, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

జీడీ నాయుడు యునైటెడ్ మోటార్స్ సర్వీస్ (UMS) ద్వారా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఆయన వ్యాపార పుస్తకాలు ఎంతో స్వచ్ఛంగా, చట్టబద్ధంగా ఉండేవి. ఆయన ఎదుగుదలను తట్టుకోలేని బ్రిటీష్ అధికారులు ఆయనను ఎలాగైనా ఇరికించాలని చూశారు. “ఆయన పుస్తకాలు క్లీన్ గా ఉంటే.. వాటిని మీరే మురికి చేయండి” అని బ్రిటీష్ పైఅధికారులు సూచనారంటే ఆయన నిజాయితీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ కాలంలోనే ఆయన జర్మనీ, నాజీలతో వ్యాపార సంబంధాలు నెరిపారు. ఇది బ్రిటీష్ కిరీటానికి వ్యతిరేకంగా చేసిన దేశద్రోహంగా భావించి బ్రిటీష్ ప్రభుత్వం ఆయనపై నిఘా పెట్టింది. బ్రిటీష్ వారే కాదు, మన దేశంలో కొందరు స్వార్థపరులు కూడా ఆయనకు శత్రువులుగా మారారు.

సరిగ్గా ఆ సమయంలోనే బ్రిటీష్ ప్రభుత్వం నాయుడుపై పన్నుల పేరుతో వేధింపులకు దిగింది. ఆయనపై అన్యాయంగా పన్నులు విధించినప్పుడే, ఆయన బ్రిటీష్ వ్యవస్థను ఎదురించి గళమెత్తారు. బ్రిటీష్ వారు ఆయన ఆస్తిలో ఏకంగా 80 శాతం జప్తు చేయడానికి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, జీడీ నాయుడు సామాన్యుడు కాదు. ఆత్మాభిమానం కలిగిన ఆ మేధావి, బ్రిటీష్ వారికి తలవంచలేదు. తాను కష్టపడి కనిపెట్టిన అద్భుతమైన సాంకేతిక పరికరాలను బ్రిటీష్ వారి చేతికి చిక్కకుండా తన చేతులతోనే పగులగొట్టి ధ్వంసం చేశారు.

గోవింద్ వసంత అద్భుతమైన సంగీతం, కృష్ణకుమార్ లీడ్ రామ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ‘జి.డి.ఎన్’ చిత్రం, చరిత్ర మరిచిన ఒక మహోన్నతుడి భారతీయ కథను ప్రపంచానికి చాటిచెప్పబోతోంది. బ్రిటీష్ వారిని భయపెట్టి, సొంత దేశస్థులచే విస్మరించబడిన ఈ వీరుడి గాథ ప్రతి ఒక్కరిలో దేశభక్తిని, స్ఫూర్తిని నింపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

GDN ట్రైలర్, GD నాయుడు, R మాధవన్, తెలుగువన్

2,801 Views

You may also like

Leave a Comment