Home ఎంటర్‌టెయిన్మెంట్ వైరల్ గా మారిన బండ్ల గణేష్ కూతురి పెళ్లి కార్డు.. ఎవరి ఆశీస్సులతో అని ఉందో తెలుసా! – VRM MEDIA

వైరల్ గా మారిన బండ్ల గణేష్ కూతురి పెళ్లి కార్డు.. ఎవరి ఆశీస్సులతో అని ఉందో తెలుసా! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


‘బ్లాక్‌బస్టర్’ చిత్రాల నిర్మాతగా, నటుడిగా తనదైన స్పీచ్‌లతో ఎప్పుడూ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన బండ్ల గణేష్(బండ్ల గణేష్)ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె జనని వివాహ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన చిలుకూరి సూర్యతేజతో జనని ఏడడుగులు వేయబోతోంది. ఈ ఏడాది మే నెలలోనే వీరి నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఆ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి దంపతులు స్వయంగా హాజరై కొత్త జంటను దీవించారు. ఇప్పుడు పెళ్లి ఘడియలు దగ్గర పడడంతో బండ్ల గణేష్ తన కుమార్తె లగ్న పత్రికను, రాజకీయ రంగాలలోని ప్రముఖులకు స్వయంగా అందజేస్తూ ఆహ్వానం పలుకుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా పెళ్లి శుభలేఖల పైభాగంలో ఇష్టదైవాల పేర్లు లేదా ఇంట్లోని పెద్దల పేర్లను ముద్రించడం మనం చూస్తాం. కానీ, బండ్ల గణేష్ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికపై అత్యంత ఆసక్తికరమైన లైన్ వేయించారు. ఆ పత్రికపై “శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో…” అని ప్రత్యేకంగా ముద్రించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నారా కుటుంబంతో బండ్ల గణేష్‌కు ఉన్న విడదీయరాని వ్యక్తిగత, రాజకీయ అనుబంధానికి ఈ శుభలేఖే నిలువెత్తు నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బండ్ల గణేష్ మొదటి నుంచి నారా చంద్రబాబు నాయుడికి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబు గారిపై ఉన్న అభిమానంతో ఆయన కోసం షాద్ నగర్ నుంచి తిరుమల కొండకు 100 మంది వరకు కాలినడకన పాదయాత్ర చేసి తన మొక్కును కూడా చెల్లించుకున్నారు.

సంప్రదాయాల ప్రకారం బండ్ల గణేష్ కుటుంబం ఈ వివాహ కార్యక్రమాలను ఏరువాక పౌర్ణమి అంటే అత్యంత పుణ్యదినాన. ఇందులో భాగంగానే మొదటి పెళ్లి పత్రికను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత ఉంచి స్వామివారి కృపాకటాక్షాలు పొందారు. ఆ తర్వాత వెంటనే రెండవ ఆహ్వాన పత్రికను నేరుగా నారా భువనేశ్వరి గారికి స్వయంగా అందించి తన కృతజ్ఞతను చాటుకున్నారు. ఇంకా, అతిథులను కూడా తమ కుటుంబ వేడుకల్లో భాగం చేసేలా, ఆహ్వాన పత్రికతో పాటు పట్టువస్త్రాలు బహుకరిస్తూ బండ్ల గణేష్ ఆహ్వానిస్తూండటం విశేషం. నారా భువనేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా హనుమకొండకు చెందిన ఒక పేద బాలుడి వైద్యం కోసం బండ్ల గణేష్ రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించి గతంలోనే తన అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ వివాహ వేడుకకు సంబంధించి ముహూర్తాన్ని కూడా ప్రత్యేకంగా నిర్ణయించారు. ఆగస్టు 16వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల 58 నిమిషాలకు శుభ ముహూర్తం జనని, సూర్యతేజల వివాహం జరగనుంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకను కనులపండువగా నిర్వహిస్తారు. అయితే ఈ వెడ్డింగ్ కార్డ్‌పై పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌ను దేవుడిగా కొలుస్తారని, మరి ఈ పత్రికలో కేవలం చంద్రబాబు దంపతుల పేర్లు మాత్రమే ఎందుకు వేశారని కొందరు ప్రశ్నిస్తుండగా, నారా కుటుంబంతో ఆయనకున్న వ్యక్తిగత రిలేషన్ వేరని మరికొందరు సమర్థిస్తున్నారు. బండ్ల గణేష్ కూతురి పెళ్లి పత్రిక ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాకుండా పొలిటికల్ సర్కిల్స్‌లోనూ ఒక రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.

2,804 Views

You may also like

Leave a Comment