
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. ప్రభుత్వం తొలి దశ నిర్మాణాలను పూర్తి స్థాయిలో నిర్దేశించింది. రెండో విడత భూ సమీకరణ అమలు చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాల పైన ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలోనే అమరావతి రైతుల జేఏసీ సమావేశమై ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతి రైతుల జేఏసీ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. రాజధాని నిర్మాణంతో పాటుగా రైతులకు హామీల అమలు.. రైతుల సమస్యలను ప్రస్తావించారు. అమరావతి పరిరక్షణ కోసం జేఏసీ ఏర్పాటు చేసినట్లు జేఏసీ నేతలు చెప్పారు. కొందరు రైతుల సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల ప్రజల అవసరాలను పట్టించుకోలేదని వాపోతారు. ఇక, రాజధాని అమరావతి రైతులతో అభివృద్ధి సలహా మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రామాలకు CRDA కి చెప్పడమే.. కానీ, వాటిని CRDA అధికారులు సరిగా చూపించటం లేదని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రభుత్వానికి కీలక సూచనలు
రైతులు ప్రస్తావిస్తున్న అంశాల నిర్దేశిత సమయాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేసారు. త్వరలో 29 గ్రామాల ప్రతినిధులతో సలహా మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తమ నుంచి అమరావతి భవిష్యత్ సూచనలు.. సలహాలు ఉన్నాయని స్పష్టం చేసారు. రైతులకు ఇప్పటి FSI నిబంధనలు వలన నష్టం కలుగుతుందని తెలియజేసారు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా FSI నిబంధనలు అమలు చేయబడ్డాయి. రాజధాని అమరావతిలో అభివృద్ధి అంతా ఒకే చోట జరుగుతుందని చెప్పారు. కౌలు గడువు ముగిశాక రైతులు జీవనోపాధి పెరిగేలా ఉండాలని ఉన్నారు. రాజధానిలో అనేక రకాల రైతులకు భూములు ఇచ్చారు.. వారికి ప్లాట్లు సకాలంలో అందించబడ్డాయి. రాజధానిలో అనేక కంపెనీలు రావాలని ఆకాంక్షించిన రైతులు.