[ad_1]
బోర్డర్ – గస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఐదో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌కు అనుకూలించిన సిడ్ని మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో ఇరుజట్ల బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యాన్ని సాధించి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 157 పరుగులకు కుప్ప కూలింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ ను దూకుడుగానే ఆరంభించింది. ఆ జట్టు ఓపెనర్లు టి20 తరహాలో బ్యాటింగ్ చేయడంతో మొదటి నాలుగు ఓవర్లలోనే దాదాపు 40 పరుగులు వచ్చాయి. ఆస్ట్రేలియా జట్టుకు లక్ష్యాన్ని సాధించడం సులభం అయింది. ఆస్ట్రేలియా ఓపెనర్లలో సామ్ కొంటాస్ 22(17), ఉస్మాన్ ఖవాజా 41(45) జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన లబుసేన్ 6(20), స్టీవెన్ స్మిత్ 4(9) వెంట వెంటనే అవుట్ అయిన తర్వాత వచ్చిన ట్రావిస్ హెడ్ 38 బంతుల్లో 34 పరుగులు (నాటౌట్), వెబ్ స్టర్ 34 బంతుల్లో 39 పరుగులు (నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో ప్రసిద్ధి కృష్ణ మూడు, మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గాయం కారణంగా కెప్టెన్ బుమ్రా బరిలోకి దిగలేదు. ఈ సిరీస్ లోనే అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టిన బుమ్రా లేని లోటు స్పష్టంగా భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కనిపించింది. భారత రెండో జట్టు ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 22 (35), రాహుల్ 13(20), గిల్ 13(15), కోహ్లీ 6(12) ఆశించిన స్థాయిలో రాణించలేదు.ఆ తరువాత వచ్చిన వికెట్ కీపర్ రషబ్ పంత్ టి20 తరహాలో ధాటిగా ఆడటంతో ఆమాత్రం స్కోరైన భారత జట్టు సత్తా చాటింది. 33 బంతులు ఆడిన రషబ్ పంత్ ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 61
[ad_2]
ఐదోస్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు.. బోర్డర్ – గవాకర్ ట్రోఫీ కైవసం -VRM MEDIA
5