Home అంతర్జాతీయ ఫైనల్ పంచ్ ఎవరిదో.. ఛాంపియన్స్ ట్రోఫీలో నేడే భారత్ న్యూజిలాండ్ తుది పోరు.! -VRM MEDIA

ఫైనల్ పంచ్ ఎవరిదో.. ఛాంపియన్స్ ట్రోఫీలో నేడే భారత్ న్యూజిలాండ్ తుది పోరు.! -VRM MEDIA

by VRM Media
0 comments
ఫైనల్ పంచ్ ఎవరిదో .. ఛాంపియన్స్ ఛాంపియన్స్ నేడే భారత్ భారత్ న్యూజిలాండ్ తుది.!

[ad_1]

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తుది పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. భారత జట్టుకు ఇది వరుసగా మూడో ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కాగా, టోర్నీలో ఇప్పటిదాకా భారత రెండుసార్లు విజేతగా నిలిచింది. 2013లో భారత్ చివరిసారి ఈ ట్రోఫీని గెలిచేది. తాజాటోనీలో బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జెట్లపై గెలిచి ఫైనల్ చేరింది. అటు న్యూజిలాండ్ జట్టు కూడా గ్రూప్ దశలో భారత్ చేతిలో ఓడింది. 2000లో భారత్ పైన గెలిచి తమ ఏకైక టైటిల్ దక్కించుకోవడం న్యూజిలాండ్ జట్టుకు ఫైనల్ మ్యాచ్‌లో సానుకూల అంశంగా చెప్పవచ్చు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లో భారత్ పై 3-1తో కివీస్ జట్టుకు ఆధిక్యం ఉంది. అందుకే భారత జట్టు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించిన కప్పు చేజారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్పిన్నర్లే ప్రధాన ఆయుధంగా భారత్..

ఈ టోర్నీలో స్పిన్నర్లను ప్రధాన ఆయుధంగా భారత జట్టు బరిలోకి దించుతోంది. ఫైనల్ మ్యాచ్‌లో వారినే తమ అస్త్రాలుగా భారత జట్టు వినియోగించుకోనుంది. బుమ్రా లేని లోటును ఏమాత్రం తెలియనీయకుండా భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతోంది. దీనికి కారణం జట్టులోనే నలుగురు స్పిన్నర్లు. కుడి – ఎడమ కాంబినేషన్‌లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ప్రత్యర్థి బ్యాటర్లను తమ ఉచ్చులో బిగిస్తున్నారు. న్యూజిలాండ్‌తో గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ వరుణ్ మాయాజాలంతో ఆ జట్టు కకావికలం అయింది. అయితే గడిచిన రెండు మ్యాచ్‌ల్లో కుల్దీప్ పెద్ద ఆకట్టుకోలేకపోయాడు. అతడి స్థానంలో ప్యాసర్లు హర్షిత్ రాణా లేదా అర్స్ దీప్ ల్లో ఒకరికి చోటిస్తారా.? అన్నది చూడాల్సి ఉంది. మరోవైపు కుడిచేతి వాటం బ్యాటర్లపై జడేజా, అక్షర్ పటేల్ ప్రభావం చూపుతోంది. మధ్య ఓవర్లలో ఖచ్చితమైన లెంతో కట్టడి చేస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పైన నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగి ఫలితాన్ని రాబట్టారు. అందుకే ఫైనల్ మ్యాచ్‌లో ఇదే వ్యూహంతో భారత జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్లుగా షమీ, హార్దిక్ పాండ్యా పవర్ ప్లేలో పరుగులను నియంత్రించాలనుకుంటున్నారు. శమీ నుంచి పూర్తిస్థాయి బౌలింగ్ ప్రదర్శన రావాల్సి ఉంది.

వీళ్లు రాణిస్తే భారత జట్టుకు తిరిగి రాదు..

భారత జట్టులోని వెటర్న్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఇదే చివరి ఐసిసి టోర్నీ కావచ్చు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ రాణించడం బట్టే మ్యాచ్ ఫలితం ఉంటుంది. గడిచిన ఏడాది టీ20 వరల్డ్ కప్ అందించినట్లుగానే ఈసారి మరో ఐసీసీ ట్రోఫీతో మురిపించాలని రోహిత్, కోహ్లీ పట్టుదలగా ఉన్నారు. విరాట్ కోహ్లీ టోర్నీలో తన ఫామ్ చాటుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. పిచ్ లు భిన్నంగా కనిపించడంతో ఈ టోర్నీ అతని ఆటలో మునుపటి వేగం లేదు. దీంతో ఫైనల్‌లో ఆ లోటును తీరుస్తూ న్యూజిలాండ్‌పై కోహ్లీ విరుచుకుపడాలని అభిమానులు కోరుకుంటున్నారు రోహిత్ శర్మ ఉన్న కాసేపు ఎడాపెడా షార్ట్‌లు బాదేసుకున్న నిలకడ లోపిస్తోంది టోర్నీలో అతడి అత్యధిక స్కోరు 41 మాత్రమే రోహిత్ శర్మ 2 ఓవర్ల వరకు కుదురుకోగలిగిన భారత జట్టు భారీ స్కోరు సాధించగలదు. మరోవైపు ఓపెనర్ గిల్, శ్రేయాస్, అక్షర్, రాహుల్, హార్దిక్ ఊపు మీదున్నారు. మరోసారి కలిసికట్టుగా ఆడితే ట్రోఫీ మరోసారి భారత్ జట్టు విజయం సాధించే అవకాశం ఉంది.

బలంగానే న్యూజిలాండ్ జట్టు..

న్యూజిలాండ్ జట్టు కూడా భారత్‌కు దీటుగా బదులిచ్చే స్థాయిలోనే ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఆ జట్టు అదరగొడుతోంది. న్యూజిలాండ్ జట్టులో సమర్థులైన స్పిన్నర్లు ఉన్నారు. కివీస్ జట్టులోనే సమర్థులైన స్పిన్నర్లు దక్షిణాఫ్రికాను ఏడు వికెట్ల తేడాతో వనికించారు. కెప్టెన్ శాంటర్ బౌలింగ్‌లో పరుగులు సాధించడం అంత సులభం కాదు. ఈ లెఫ్టామ్ స్పిన్నర్ ఖాతాలో 4.85 ఎకానమీ రేటుతో 7 వికెట్లు ఉన్నాయి. అతడికి తోడు బ్రెష్ వెల్, రచిన్, ఫిలిప్స్ దుబాయ్ పిచ్చి పై రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. గడిచిన ఏడాది స్పిన్ బలంతోనే ఆ జట్టు భారత జట్టుపై శిరీషను క్లీన్ స్వీప్ చేసింది. భారత జట్టుపై ఐదు వికెట్లతో రాణించిన పేషర్ హేనరీ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం దాదాపు ఖాయమైంది. సెమీస్‌లో దక్షిణాఫ్రికా పై 362 పరుగులు సాధించి బ్యాటర్ల సైతం ఊపు మీద ఉన్నారు. రచన రవీంద్ర, విలియమ్సన్ శతకాలతో అదరగొట్టారు. మిచెల్, గ్రాండ్ ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్‌లతో సఫారీలను చిత్తుగా ఓడించారు. ఇక వీరు ఫీల్డింగ్ ప్రత్యర్థి జట్లను వణికిస్తుంటుంది. అందుకే అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న న్యూజిలాండ్‌ను ఓడించడం భారత్‌కు అంతా సులభమేమీ కాదు.

పిచ్ అంచనా..

భారత జట్టు ఇప్పటివరకు నాలుగు పిచ్ లపై ఆడింది. అయితే ఫైనల్ కు మాత్రం పాకిస్థాన్ తో ఆడిన పిచ్చిను సిద్ధం చేయనున్నారు. ఆ మ్యాచ్ జరిగే రెండు వారాలు కాబట్టి తాజాగా క్యూరేటర్ చెబుతున్నారు. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ సులువైన ఆ తర్వాత చేదన కష్టంగా మారింది. స్పిన్నర్ల కే కాకుండా ఈ వికెట్ ప్యాసర్లకు కూడా అనుకూలిస్తుంది.

ఇవి జట్లు అంచనా

భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీం జడేజా, కుల్దీప్ యాదవ్, షమీ, వరుణ్ చక్రవర్తి

న్యూజిలాండ్ జట్టు

యంగ్, రచన రవీంద్ర, విలియమ్సన్, లాథమ్ మిచెల్, ఫిలిప్స్, బ్రేస్వెల్, శాంట్నర్ (కెప్టెన్), జెమిషన్, ఒరౌర్కీ, హెన్రీ/ స్మిత్

మా అమ్మ బతికే ఉంది: సీఎం రమేశ్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

[ad_2]

You may also like

Leave a Comment

About Us

We're a media company. We promise to tell you what's new in the parts of modern life that matter. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo. Sed consequat, leo eget bibendum sodales, augue velit.

Facebook Twitter Youtube Linkedin Instagram

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs

Recent Articles

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs Daily horoscope: Your star sign reading, astrology and zodiac forecast Theory: Tom Holland’s Peter Parker replaced by Miles Morales in next trilogy

Featured

Latest box office bomb ‘will lose $100 million’ amid ongoing pandemic England vs South Africa free live stream: Watch Autumn Nations Series online White House plan aims to protect science from politics with new approach @2022 - All Right Reserved. Designed and Developed by PenciDesign