సిద్ధవటంVRM Media ప్రతినిధి లక్ష్మీనారాయణ జూలై 28


సిద్ధవటం మండలంలోని పలు గ్రామపంచాయతీలలో *సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, క్లస్టర్ ఇంచార్జ్ దశరథ నాయుడు గారు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కాగా ఈరోజు మాధవరం 1 గ్రామ పంచాయతీలోని 36,35 వ బూతులలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పెన్షన్ తీసుకుంటున్న అవ్వ తాతలను, తల్లికి వందనం వస్తున్న తల్లిదండ్రులను వారి పిల్లలను, దీపం పథకంకు అర్హులైన మహిళలకు వారి అభిప్రాయాలు తెలుసుకొన్న మోహన్ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో తీసుకువచ్చిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే నాలుగు సంవత్సరాలలో మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకుపోయే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వారి సారథ్యంలోని మంత్రివర్గం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రతి పేద కుటుంబాన్ని సంపన్న కుటుంబం గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రభుత్వ పథకం ఫలాలను అన్ని కుటుంబాలకు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎవరికైనా అనివార్య కారణాలవల్ల పథకాలు అర్హులకు అందకపోతే వారికి కచ్చితంగా న్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ప్రజలందరూ గత ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి తేడా గమనించాలని కూలగొట్టే రాక్షస పాలన పోయి, నిర్మించే మంచి ప్రభుత్వం మనం చూస్తున్నామని, ప్రస్తుతం ఎవరు కూడా అవినీతికి పాల్పడడం లేదని గత ప్రభుత్వంలోని మంత్రులతో సహా ఎంతోమంది అవినీతి ఆరోపణలతో కటకటాల వెనకకు వెళ్తున్నారని కర్మ ఎవరిని వదిలిపెట్టదని గుర్తు చేశారు. ప్రజలందరికీ శాంతియుత పాలన, అభివృద్ధి పాలన,సంక్షేమ పాలన, విజనరి పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండల టీడీపీ అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ దశరథ నాయుడు, నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు డాక్టర్ నాగూరు వీరభద్రుడు,కరమళ్ల భాష గ్రామం లోని టీడీపీ యూత్ పెగడ హరిప్రసాద్, బషీర్, వెంకటేష్,మురళి మరియు బూత్ కన్వీనర్స్ చెన్నకేశవులు, సుబ్బరాయుడు, యానాది, కమల్ బి, మౌలాలి,రహత్తున్ బి గ్రామ ప్రజలు, పెద్దలు పిల్లలు పాల్గొన్నారు.