
సిద్ధవటంVRM న్యూస్ ప్రతినిధి ఆగస్టు 4
సిద్ధవటం మండలం టక్కోలు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం గ్రామస్థాయిలో వేగంగా అమలవుతోంది. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నెత్రుత్వంలో, నారా లోకేష్ గారి కృషితో, మరియు రాజంపేట పార్లిమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారి మార్గదర్శకత్వంలో అమలవుతోంది.
ఈ క్రమంలో టక్కోలు గ్రామంలో టీడీపీ పార్లిమెంట్ అధ్యక్షులు నాగముని రెడ్డి గారు ముందుకు వచ్చి, 30 కుటుంబాలకు మార్గదర్శకులుగా బాధ్యత స్వీకరించారు. అలాగే వారి సోదరులు చిన్నప రెడ్డి గారు కూడా 10 కుటుంబాలకు మార్గదర్శకులుగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా నాగముని రెడ్డి గారు మాట్లాడుతూ –
“మార్గదర్శకులుగా నియమితమైన కుటుంబాలకు అన్ని ప్రభుత్వ పథకాలు సజావుగా అందేలా చూస్తాం. వారి అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో చేయూతనిస్తాం,” అని తెలిపారు.