
పెన్నా పేరూరు గ్రామస్తులు మంత్రి మండిపల్లి గారి సమక్షంలో 100 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలోకి చేరిక
VRM న్యూస్ ఒంటిమిట్ట
మంగళవారం రోజు మధ్యాహ్నం కడప జిల్లా,ఒంటిమిట్ట లో జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యం లో రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని గజమాలతో ఆయన స్వాగతం పలికారు ఆయన పర్యవేక్షణ బాధ్యతలలో భాగంగా ఒంటిమిట్ట మండలం పెన్న పేరూరు గ్రామంలో మంత్రిగారు మరియు రాజంపేట పరిశీలకులు పర్యటించినారు, తర్వాత ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా ముద్దు కృష్ణ రెడ్డి కి బీఫామ్ అందజేశారు పలువురు ప్రజా ప్రతినిధులు మరియు 100 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టిడిపిలో చేరారు. జడ్పిటిసి ఉప ఎన్నిక టిడిపి అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, హరి ప్రసాద్ పుంగనూరు ఇన్చార్జి చల్లా బాబు, టిడిపి నాయకుడు పోలు సుబ్బారెడ్డి, ఒంటిమిట్ట మండల నాయకుడు కొమరా వెంకట నరసయ్య మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు బొడ్డే రమణ , పామూరు సుబ్రహ్మణ్యం ఈశ్వరయ్య బాలమునయ్య సుంకేసుల భాష నల్లగొండు వెంకటసుబ్బారెడ్డి పత్తి సుబ్బరాయుడు కత్తి అయ్యవారయ్య లాయర్ ఆదినారాయణ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు…